శివాత్మిక, బ్రహ్మానందం కొత్త జీవనాధారం కోసం `పంచతంత్రం`.. ఆసక్తిరేకెత్తిస్తున్న టీజర్‌..

By Aithagoni RajuFirst Published Oct 13, 2021, 9:15 PM IST
Highlights

'అనగనగా ఓ పెద్ద అడవి. అందులో జంతువులన్నీ కూడు, గూడు, తోడు వెతుక్కున్నాక... నాలుగో జీవనాధారం కోసం అన్నీ ఒక చోట కలిసి కథలు చెప్పుకోవడం మొదలుపెట్టాయి` అనే వాయిస్‌ ఓవర్‌తో సాగే టీజర్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

శివాత్మిక నటిస్తున్న లేటెస్ట్ మూవీ `పంచతంత్రం`. ఓ విభిన్న కథా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుండగా, `మత్తువదలరా` ఫేమ్‌ హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం, సముద్రఖని, `కలర్స్` స్వాతిరెడ్డి, రాహుల్‌ విజయ్‌లతో కలిసి శివాత్మిక ఈ సినిమా చేస్తుంది. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. 

ఈ నేపథ్యంలో ఇప్పటికే లహరి ఆడియో ద్వారా విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా బుధవారం టీజర్‌ని విడుదల చేశారు. 'అనగనగా ఓ పెద్ద అడవి. అందులో జంతువులన్నీ కూడు, గూడు, తోడు వెతుక్కున్నాక... నాలుగో జీవనాధారం కోసం అన్నీ ఒక చోట కలిసి కథలు చెప్పుకోవడం మొదలుపెట్టాయి` అనే వాయిస్‌ ఓవర్‌తో సాగే టీజర్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. బ్రహ్మానందం కథలు చెప్పే మాస్టర్ గా కనిపిస్తున్నారు. టీజర్‌ చూస్తుంటే సినిమా డిఫరెంట్‌గా ఉండబోతుందని, విభిన్న నేపథ్యాలకు చెందిన మనుషుల కథలను ఈ సినిమా చెప్పబోతుందని అర్థమవుతుంది. 

ఈ సందర్భంగా దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ, `పంచతంత్రం` ఒక అమ్యూజ్‌మెంట్‌ పార్క్ లాంటిదని, టికెట్‌ తీసుకుని అమ్యూజ్‌మెంట్‌ పార్క్ కి వెళితే డిఫరెంట్‌ రైడ్స్ ఉంటాయన్నారు. ప్రతి అరగంటకి ప్రేక్షకులను కొత్త రైడ్‌కి తీసుకెళ్తుందన్నారు.  నిర్మాత దొరకడం ఓ బంగారు ఆభరణం మా చేతిలో ఉన్నట్టు ఉంది. దానికి డైమండ్ ఫెంటాస్టిక్‌ ఆర్టిస్టుల రూపంలో దక్కింది. మేం అడిగిన వెంటనే టీజర్ కి వాయిస్ ఓవర్ అందించిన సత్యదేవ్ కి థాంక్స్. త్వరలో థియేటర్లలో మా సినిమా విడుదల కాబోతుందని తెలిపారు.

`టీజర్‌లో మాదిరిగానే మేం  కూడా! అనగనగా ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్లు, టెక్నీషియన్లు మా పనులు మేం చేసుకుంటూ ఉంటే.. ఒక కొత్త జీవనాధారం కోసం 'పంచతంత్రం' అని ఒక సినిమా చేశాం` అని హీరో రాహుల్‌ విజయ్ తెలిపారు. ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుందని, దర్శకుడు హర్ష ఈ సినిమా కథ రాసినప్పుడు ప్రేక్షకుల వరకూ రావడం కోసం మేమంతా ఓ సాయం చేశాం. నేను చేసినది ఉడతా సాయమే. అఖిలేష్ డబ్బులు ఇచ్చాడు కాబట్టి... సాయం అంటే కొడతాడేమో!` అని అన్నారు.

also read: వీడియో... బికినీలో జలకాలాడుతున్న రకుల్... వైరల్ గా ఇంస్టాగ్రామ్ పోస్ట్!

శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ, బ్రహ్మానందం గారు, స్వాతి గారు, సముద్రఖని గారు వంటి పెద్ద నటీనటులతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది.  స్నేహితులతో వెళ్లి సినిమా తీసుకొచ్చినట్టు అనిపించింది. 'దొరసాని' తర్వాత తెలుగులో నా రెండో సినిమా 'పంచతంత్రం'. రెండింటికీ ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. ఆయనతో పని చేయడం సంతోషంగా ఉంది` అని చెప్పింది. 

also read:ఆయన అక్కడ ఈమె ఇక్కడ... సోషల్ మీడియాలో మాత్రం పరువాల జాతర... చిన్న గౌనులో మరలా రెచ్చిపోయిన ప్రియమణి

నటీనటులు:
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ ‌ తదితరులు.

సాంకేతిక వర్గం:
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌ – ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా), అసోసియేట్ డైరెక్టర్: విక్రమ్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అయేషా మరియమ్‌, ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి, మాటలు: హర్ష పులిపాక, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి, నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు, రైటర్‌–డైరెక్టర్‌: హర్ష పులిపాక.

click me!