‘‘మా’’ ఎన్నికలు: మంచు విష్ణుకు షాక్, సుప్రీంకోర్టుకెక్కనున్న ప్రకాశ్ రాజ్.. ఆధారాలు సిద్ధం చేసే పనిలో బిజీ

By Siva KodatiFirst Published Oct 14, 2021, 9:34 PM IST
Highlights

ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘‘మా’’ ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తితో వున్న ఆయన.. సుప్రీంకోర్టుకు (supreme court) వెళ్లే ఆలోచనలో వున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు (maa elections) ముగిసినా వివాదాలు, విమర్శలు చల్లారడం లేదు. ఇప్పటికే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు చేసిన ప్రకాశ్ రాజ్ (prakash raj).. తన ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులతో రాజీనామా చేయించారు. 

మూవీ ఆర్టిస్ట్  అసోసియేషన్ ఎన్నికలు (maa elections) ముగిసినా వివాదాలు, విమర్శలు చల్లారడం లేదు. ఇప్పటికే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు చేసిన ప్రకాశ్ రాజ్ (prakash raj).. తన ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులతో రాజీనామా చేయించారు. తాజాగా ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘‘మా’’ ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తితో వున్న ఆయన.. సుప్రీంకోర్టుకు (supreme court) వెళ్లే ఆలోచనలో వున్నారు. 

న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సీసీ ఫుటేజ్ కీలకమని ప్రకాశ్ రాజ్ సభ్యులు చెబుతున్నారు. ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయించాలని ప్యానెల్ నిర్ణయించింది. నిన్నా, ఇవాళ ఇదే అంశంపై ప్రకాశ్ రాజ్ ప్యానెల్ దీనిపైనే చర్చించినట్లుగా తెలుస్తోంది. అందరి ఏకాభిప్రాయంతో సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. 

అంతకుముందు ప్రకాష్‌ రాజ్‌ maa election Officrకి లేఖ రాశారు. `మా` ఎన్నికల పోలింగ్‌ రోజు, పోలింగ్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటనలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన సీసీ ఫుటేజీని తమకి ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కి ప్రకాష్‌ రాజ్‌ లేఖ రాశారు. 

ఆ లేఖని ప్రకాష్‌రాజ్‌ ట్విట్టర్‌ ద్వారా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇందులో ఆయన చెబుతూ `మా` ఎన్నికల్లో జరిగిన అనేక దురదృష్టకర సంఘటనలకు మీరు సాక్షులు. ఆ రోజు మోహన్‌బాబు (mohan babu), మాజీ మా అధ్యక్షుడు నరేష్‌ (naresh) ల వికృతి, సామాజిక వ్యతిరేక ప్రవర్తనని మేం చూశాం. వారు మా సభ్యులను దూషించారు. బెదిరించారు. శారీరకంగా దాడి చేశారు. పోలింగ్‌ కేంద్రంలోకి వారి అనుచరులను అనుమతించారు. దాంట్లో మీరు మీ విచక్షణాధికారాలను ఉపయోగించారని అనుకుంటున్నా. 

Also Read:Maa Elections: సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ ప్రకాశ్ రాజ్ లేఖ.. ‘మా’ ఎన్నికల అధికారి స్పందన ఇది..!!

కొన్ని విజువల్స్ మీడియాకి లీక్‌ అయ్యారు. `మా` ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనలు ప్రజల దృష్టిలో మాకు నవ్వు తెప్పించాయి. తెలిసిన కొన్ని ముఖాల ప్రవర్తన పట్ల అసహ్యంగా ఉంది. `మా` సభ్యులు కూడా ఈ నివేదికల గురించి నిజం తెలుసుకోవాలనుకున్నారు. పోలింగ్‌ సమయంలో ఆ కేంద్రంలో సీసీ కెమెరాల వినియోగం గురించి మాట్లాడుకున్నాం. అందులో ప్రతిదీ రికార్డ్ చేశారని నేను నమ్ముతున్నా. కాబట్టి మాకు సీసీటీవీ ఫుటేజ్‌ని ఇవ్వమని కోరుతున్నా. ఎన్నికలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందడం మన ప్రజాస్వామ్య హక్కు. ఒక పోలింగ్‌ అధికారిగా అన్ని రికార్డులను కనీసం మూడు నెలలు భద్రపరడం మీ విధి. అనేక సుప్రీం కోర్ట్ (supreme court) తీర్పులు కూడా పోలింగ్‌ అధికారులను రికార్డులను భద్రపరమని ఆదేశించాయి. 

కాబట్టి సాధ్యమైనంత త్వరగా మాకు సీసీ టీవీ ఫుటేజ్‌ని ఇవ్వమని మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నా. మీరు వెంటనే చర్య తీసుకోకపోతే, ఫుటేజ్‌ తొలగించబడుతుందని, ట్యాంపరింగ్‌ అయ్యే అవకాశాలున్నాయని  భయంగా ఉంది. దయజేసి ఈ లేఖని అంగీకరించండి` అని తెలిపారు ప్రకాష్‌రాజ్‌. సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు బయటకు వస్తాయని, ప్రజలకు తెలుస్తుందని వెల్లడించారు ప్రకాష్‌రాజ్‌.


 

click me!