పవన్‌ కళ్యాణ్‌తో మంచు మనోజ్‌ భేటీ.. ఆసక్తిరేకెత్తిస్తున్న కొత్త పరిణామాలు.. రాజీ ప్రయత్నమా?

Published : Oct 14, 2021, 08:20 PM IST
పవన్‌ కళ్యాణ్‌తో మంచు మనోజ్‌ భేటీ.. ఆసక్తిరేకెత్తిస్తున్న కొత్త పరిణామాలు.. రాజీ ప్రయత్నమా?

సారాంశం

`మా` ఎన్నికల అనంతరం కొత్త పరిణామాలు మరింత వివాదానికి దారితీస్తున్నాయి. ఎన్నికల తర్వాతనే అసలైన రచ్చ స్టార్ట్ అయ్యిందనేలా ఇటీవల పరిణామాలు దారి తీశాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్‌.. పవన్‌ కళ్యాణ్‌ని కలవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

`మా` ఎన్నికలు టాలీవుడ్‌లో ఎంతటి దుమారాన్ని క్రియేట్‌ చేశాయో తెలిసిందే. మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ మధ్య పోటీని తలపించాయి. అంతేకాదు ఇద్దరి మధ్యే పోటీ అనేది పరోక్షంగా సాగింది. అయితే ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకోవడం పెద్ద దుమారానికి తావిస్తుంది. `మా` ఎన్నికల అనంతరం కొత్త పరిణామాలు మరింత వివాదానికి దారితీస్తున్నాయి. ఎన్నికల తర్వాతనే అసలైన రచ్చ స్టార్ట్ అయ్యిందనేలా ఇటీవల పరిణామాలు దారి తీశాయి. 

ఈ నేపథ్యంలో మంచు మనోజ్‌.. పవన్‌ కళ్యాణ్‌ని కలవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అనేక ఊహాగనాలకు తావిస్తుంది. ప్రస్తుతం పవన్‌ `భీమ్లా నాయక్‌` చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. షూటింగ్‌ స్పాట్‌లో పవన్‌ కళ్యాణ్‌ని కలిశారు మంచు మనోజ్‌. వీరిద్దరు సుమారు గంటకుపైగా అనేక విషయాలను చర్చించుకున్నారట. ఇటీవల చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలపై వారు సుదీర్ఘంగా చర్చించారట. 

ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌ `రిపబ్లిక్‌` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మోహన్‌బాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండస్ట్రీ సమస్యలపై ఆయన ముందుకు రావాలని, పరిష్కారం దిశగా అడుగులు వేయాలని చురకలు అంటించారు. ఇంత జరుగుతున్నా స్పందించకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు `మా`లో లోకల్‌, నాన్‌లోకల్‌ ఇష్యూ తీసుకురావడం మీద కూడా పవన్‌ ఫైర్‌ అయ్యారు. పరోక్షంగా మంచు ఫ్యామిలీని ఉద్దేశించి పవన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఇటీవల జరిగిన `మా` ఎన్నికల్లో తనని తప్పుకోవాలని చిరంజీవి కోరినట్టు ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం విష్ణు తెలిపారు. మోహన్‌బాబు సైతం చిరుని టార్గెట్‌గా ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మంచు మనోజ్‌.. పవన్‌ని కలవడం ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారుతుంది. వీరిద్దరు ఏ అంశాలను చర్చించారనేది, ఏం మాట్లాడుకున్నారనేది సస్పెన్స్ గా మారింది. 

ఇదిలా ఉంటే మంచు మనోజ్‌.. మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య నెలకొన్న వివాదాన్ని సెట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, మనోజ్‌ని రాయబారిగా మార్చారనే టాక్‌ వస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ పవన్‌ కళ్యాణ్‌ని, మంచు మనోజ్‌ కలవడం మాత్రం ఇప్పుడు టాలీవుడ్‌లోనే హాట్‌ టాపిక్‌గా మారింది. సరికొత్త పరిణామాలకు తెరలేపినట్టవుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?