`అన్‌స్టాపబుల్` అనే షో కోసం బాలయ్య వ్యాఖ్యతగా అలరించబోతున్నారు. మాస్ డైలాగ్‌లతో, భారీ యాక్షన్‌లతో దుమ్ములేపే బాలయ్య ఇప్పుడు హోస్ట్ గా మారడం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ షో నవంబర్ 4 నుంచి ఆహాలో ప్రసారం కానుంది.
బాలకృష్ణ సంచలనాలకు తెరలేపబోతున్నారు. ఫస్ట్ టైమ్ ఆయన వ్యాఖ్యాతగా వ్వహరించబోతున్నారు. ఓ ఓటీటీ కోసం ఆయన హోస్ట్ గా మారడం విశేషం. balakrishna కెరీర్‌లో ఒక ప్రయోగం చేయబోతున్నారని చెప్పొచ్చు. అల్లు అరవింద్ టీమ్ నిర్వహిస్తున్న `ఆహా` ఓటీటీ కోసం బాలయ్య డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. `అన్‌స్టాపబుల్` అనే షో కోసం బాలయ్య వ్యాఖ్యతగా అలరించబోతున్నారు. మాస్ డైలాగ్‌లతో, భారీ యాక్షన్‌లతో దుమ్ములేపే బాలయ్య ఇప్పుడు హోస్ట్ గా మారడం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
unstoppable షో నవంబర్ 4 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. తాజాగా ఈ షోకి సంబంధించిన కర్టెన్‌రైజర్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో nbk ఎంట్రీ అదిరిపోయింది. ఆరు పదులకు దగ్గరలో ఉన్న బాలయ్యలో ఇంతటి ఎనర్జీకి అంతా ఫిదా అవుతున్నారు. ఎంట్రీతోనే ఆయన మాస్ బీట్‌కి స్టెప్పులేసి అదరగొట్టారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను తెలిపారు. రాయికి దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుందన్నారు. ప్రతి మనిషిలో ఒక ప్రయాణం ఉంటుందని, జీవితంలో ఎత్తుపల్లాలుంటాయని, వాటిని అధిగమిస్తేనే ఒక లక్ష్యానికి చేరగలుగుతామన్నారు. అదే విషయాన్ని `అన్ స్టాపబుల్`షోలో చెప్పబోతున్నామన్నారు. ఈ కాన్సెప్ట్ నచ్చి షోకి ఒప్పుకున్నట్టు చెప్పారు.
బాలయ్య చెబుతూ, `సాంఘికం, జానపదం, సోషియో ఫాంటసీ, కుటుంబ కథా చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి మీకు వినోదాన్ని అందించటానికి ప్రయత్నిస్తున్నా. మీరు అంతులేని ప్రేమాభిమానాలతో నన్ను ఆదరిస్తున్నారు. ఇంకా ఎంతో చేయాలని ప్రేరణ ఇస్తోంది మన తెలుగు జాతి. `ఆహా` ఓటీటీ మాధ్యమం అల్లు అరవింద్ మానస పుత్రిక. అంతర్జాతీయ ఓటీటీలకు దీటుగా `ఆహా`ను స్థాపించారు. అల్లు రామలింగయ్యగారికి మాత్రమే అమ్మానాన్నల దగ్గర చనువు ఉండేది. ఇండస్ట్రీలో ఆ స్థాయి చనువు మరెవరికీ లేద`ని తెలిపారు.
also read: పవన్ కళ్యాణ్‌తో మంచు మనోజ్ భేటీ.. ఆసక్తిరేకెత్తిస్తున్న కొత్త పరిణామాలు.. రాజీ ప్రయత్నమా?
`దర్శకుడు ప్రశాంత్ వర్మతో సహా ఎంతో మంది ఈ షోకు కష్టపడి పనిచేస్తున్నారు. తెలుగువారు గర్వించదగ్గ ఓటీటీ `ఆహా`. ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుంది. అది ఉన్నప్పుడే అసలు మజా ఉంటుంది. ఒక మనిషి ప్రజెంటేషన్ ఆహాలో వస్తున్న `అన్‌స్టాపబుల్`. నటన అంటే ఒక పాత్రలోకి వెళ్లడం. దాని ఆత్మలోకి ప్రవేశించటం. ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. మనుషులుగా మనమంతా ఒకటే. బావిలో కప్పలా ఉండకుండా బయటకు వచ్చినప్పుడు అసలు మనిషి ఆవిష్కరించబడతాడు. అలా ఆవిష్కరించే ప్రయత్నమే `అన్‌స్టాపపబుల్`. ఈ కార్యక్రమానికి వచ్చే నటీనటులతో కలిసి మాట్లాడతా. వాళ్ల భావోద్వేగాలు పంచుకుంటా. మాటలతో వాళ్లను ట్విస్ట్ చేస్తా`నని తెలిపారు బాలయ్య.
అల్లు అరవింద్ చెబుతూ, బాలకృష్ణ వెండితెరపై నటుడేమో కానీ, నిజ జీవితంలో కాదు. భావోద్వేగాలను దాచుకోరు. కోపం, బాధ, ప్రేమ, నవ్వు ఏదైనా ఉన్నది ఉన్నట్లు చూపిస్తారు. అలాంటి వ్యక్తి వ్యాఖ్యాతగా `అన్‌స్టాపబుల్` చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఒకరోజు `ఆహా` టీమ్‌తో కలిసి మాట్లాడుతున్న సమయంలో `బాలకృష్ణతో షో చేస్తే ఎలా ఉంటుంది` అని అన్నాను. అందరూ అరుపులు, ఈలలు వేశారు. మరో క్షణం ఆలోచించకుండా వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేశా. ఆయన కూడా ఓకే అన్నారు. అలా ఈ షో పట్టాలెక్కింది` అని చెప్పారు.
also read:బాలయ్యని కలిసిన విష్ణు, మోహన్ బాబు..సంస్కారం అంటే అది, నారా లోకేష్ పై కామెంట్స్