స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతున్న ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌` టీజర్‌కి ముందు స్వీట్‌ సర్‌ప్రైజ్‌లు

Published : Oct 22, 2021, 12:57 PM IST
స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతున్న ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌` టీజర్‌కి ముందు స్వీట్‌ సర్‌ప్రైజ్‌లు

సారాంశం

 ప్రభాస్‌ నటిస్తున్న `రాధేశ్యామ్‌`  నుంచి మరో కొత్త పోస్టర్లు సందడి చేస్తున్నాయి. టీజర్‌కి ముందు అభిమానులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌లిస్తున్నారు ప్రభాస్. ఇందులో ప్రభాస్‌ ఎంతో క్యూట్‌గా, హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తుండటం విశేషం.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ బర్త్ డే పునకాలు స్టార్ట్ అవుతున్నాయి. రెండూ రోజుల క్రితమే అభిమానులు పండగ చేసుకున్నారు. డార్లింగ్‌ బర్త్ డే సీడీపీ సోషల్‌ మీడియాని ఓ ఊపుఊపేసింది. ఆయన బర్త్ డే కి ఒక్క రోజు ఉంది. దీంతో ప్రస్తుతం Prabhasకి సంబంధించిన విషయాలే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రధానంగా హైలైట్‌ అవుతున్నాయి. ఏకంగా `గ్లోబల్‌ ప్రభాస్‌ డే` పేరుతో ఆయనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ని ట్రెండ్ చేస్తున్నారు. 

తాజాగా ప్రభాస్‌ నటిస్తున్న Radheshyam నుంచి మరో కొత్త పోస్టర్లు సందడి చేస్తున్నాయి. టీజర్‌కి ముందు అభిమానులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌లిస్తున్నారు ప్రభాస్. ఇందులో ప్రభాస్‌ ఎంతో క్యూట్‌గా, హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తుండటం విశేషం. బైక్‌లో ప్రభాస్‌ ఉండగా, బైక్‌ ఎక్కేందుకు Pooja Hegdeవస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మరోవైపు బైక్‌ ని పట్టుకుని స్టయిల్‌గా నిల్చున్న ఫోటో సైతం వైరల్ అవుతుంది. బ్లూ డ్రెస్‌లో ప్రభాస్‌ స్టయిల్‌కి ఐకాన్‌గా కనిపిస్తున్నారు. ఇలా ప్రియురాలు పూజాతో ప్రభాస్‌ ఇలా బైక్‌లో ఫారెన్‌ వీధుల్లో షికారుకి వెళ్లబోతున్నట్టున్నారు ఈ ఫోటోని చూస్తుంటే.

also read: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. స్టైలిష్ హెయిర్ స్టైల్స్ చూశారా..?

`జిల్‌` ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో `రాధేశ్యామ్‌` చిత్రం రూపొందుతుంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద(కృష్ణంరాజు కూతురు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇది పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ సినిమాలపై అంచనాలను అమాంతం పెంచేసింది. పోస్టర్స్ కూడా ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తున్నాయి. 

ప్రభాస్‌ బర్త్ డే కానుకగా రేపు(అక్టోబర్‌ 23)న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. పాన్‌ ఇండియా మూవీగా ఇది రూపొందుతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇందులో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. భాగ్యశ్రీ.. ప్రభాస్‌కి మదర్‌ రోల్‌ చేస్తుంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా రూపొందుతుండటం విశేషం. 

also read: ఈ 50 కోట్ల రచ్చ ఏంటి డార్లింగ్?!!

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్