నేను వాటిలో పెట్టుబడే పెట్టలేదు.. సంజనా గల్రానీ..!

Published : Oct 22, 2021, 12:52 PM ISTUpdated : Oct 22, 2021, 12:57 PM IST
నేను వాటిలో పెట్టుబడే పెట్టలేదు.. సంజనా గల్రానీ..!

సారాంశం

బింగో అనేది ఇంటర్నెట్ లో నగదు పెట్టుబడి పెట్టే ఆట ఇది.. దీనిని క్యాసినో జూదం లానే భావిస్తారు. కాగా ఈ ఆరోపణలపై తాజాగా సంజనా స్పందించింది.

కర్ణాటక రాష్ట్రాన్ని డ్రగ్స్ కేసు పట్టి పీడిస్తోంది. ఈ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు వినపడటంతో.. అందరికీ దీనిపై ఆసక్తి కలిగింది. వారిలో సినీ నటి సంజనా గల్రానీ కూడా ఉన్నారు. ఈ కేసులో ఆమె చాలా కాలం జైలుు శిక్ష అనుభవించారు. తర్వాత బెయిల్ పై విడుదల అయినా కూడా ఆమెను ఈ కేసు వదలడం లేదు. అధికారులు ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు.

ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగానే.. చైనా దేశానికి చెందిన బింగో, హకూన యాప్ ల ద్వారా ఆమె నగదు సంపాదిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చినట్లు సీబీఐ అధికారులు వివరించారు. బింగో అనేది ఇంటర్నెట్ లో నగదు పెట్టుబడి పెట్టే ఆట ఇది.. దీనిని క్యాసినో జూదం లానే భావిస్తారు. కాగా ఈ ఆరోపణలపై తాజాగా సంజనా స్పందించింది.

Also Read: క్యాబ్ డ్రైవర్ వేధించాడు... డ్రగ్స్ ఆరోపణల అనంతరం మరోసారి వార్తలకెక్కిన హీరోయిన్ సంజనా గల్రాని

తాను ఎప్పుడూ క్యాసినో లో పెట్టుబడులు పెట్టలేదని ఆమె పేర్కొన్నారు. రాహుల్ తన బ్రదర్ లాంటివాడని.. తని తల్లిదండ్రులు తనను వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని అడిగారని సంజనా పేర్కొన్నారు. వారి పేరెంట్స్ తనను డబ్బులు అడిగితే.. వారి ఎకౌంట్ కి తాను పంపించానని ఆమె చెప్పారు. అయితే.. అతను తనకు తిరిగి తనకు డబ్బులు ఇవ్వలేకపోవడంతో తాను కోర్టును ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు. 

ఆ డబ్బులు తాను క్యాసినో లో పెట్టుబడుల కోసం ఇవ్వలేదని ఆమె చెప్పారు. క్యాసినోలో పెట్టుబడులు పెట్టేంత డబ్బు తన దగ్గర లేదని ఆమె పేర్కొనడం గమనార్హం. తాను సహాయం చేయడానికి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని తాను రాహుల్ ని అడిగినప్పుడు.. అతను తనపై విమర్శలు చేశాడని.. దారుణంగా తిట్టాడని ఆమె వాపోయారు.

Also Read: కన్నడ డ్రగ్స్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. సంజన, రాగిణి డ్రగ్స్ తీసుకున్నట్టు సీఎఫ్‌ఎస్‌ఎల్‌ వెల్లడి

ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు మేరకు రాహుల్ పై  చీటింగ్ కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: హస్పిటల్లో దీప- దశరథను రెచ్చగొట్టిన జ్యో- నిజం చెప్పేశాడా?
Mansion House Mallesh Movie Review: మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?