
బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ సన్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడూ కొట్టుకుంటూ, అరుచుకుంటూ... నానా గోల చేసే Bigg boss కంటెస్టెంట్స్ తమకు జరిగిన అవమానాలు, బాధలు, విజయాలు, అపజయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. ముందుగా వీజే సన్నీ మాట్లాడుతూ... ముగ్గురు అబ్బాయిలను తన తల్లి ఒక్కరే పెంచారని, అది ఎంతో కష్టమైన పని అని, తల్లి త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.
తరువాత జెస్సి మాట్లాడడం జరిగింది. 'నాకు పుట్టుకతోనే గొంతు సమస్య ఉంది. సరిగా మాట్లాడలేను. అది దేవుడు ఇచ్చిన సమస్య. అయినప్పటికీ నేను ఫ్యాషన్ ఐకాన్ గా ఎదిగాను. గిన్నిస్ బుక్ రికార్డు సాధించాను. నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అయినా మా అమ్మ ఇప్పటికీ నా కొడుకు మోడల్ అని చెప్పుకోదు...' అని జెస్సి తెలియజేశాడు. కొడుకు మోడల్ అని చెప్పుకోవడం ఆమెకు నచ్చదని, అవమానకరంగా భావిస్తుందని jessy వేదన చెందారు.
Also read షర్ట్ విప్పేసి విసిరికొట్టిన సిరి.. నన్ను ఎదవని చేసి వాడుకున్నారు అంటూ షణ్ముఖ్ ఆవేదన
మరొక కంటెస్టెంట్ ప్రియ మాట్లాడుతూ... పెళ్లి తరువాత యాక్టింగ్ మానేశా. వెంటనే ఓ బాబు పుట్టాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. లైఫ్ లో సెటిల్ కాలేదు... అని Priya ఎమోషనల్ అయ్యారు. ఇక సిరి తన ఊరిలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంది. కొందరు సిరిని ఉద్దేశిస్తూ తల్లి పద్దతిగా ఉందా, కూతురు పద్దతిగా పెరగడానికి అని అవమానకర వ్యాఖ్యలు చేశారట. వాళ్ళందరికి నేను చెప్పేది ఏమిటంటే నేను పద్దతిగానే పెరిగాను, పద్దతిగానే ఉంటున్నాను అంటూ Siri తన బాధ వెళ్లగక్కింది.
Also read హాట్నెస్ ఓవర్ లోడెడ్... బికినీలో పూజా హెగ్డే రచ్చ, కోటు చాటు దాచిన అందాలు అలా మెల్లగా చూపించేసింది
ఇక రవి మాట్లాడుతూ... జీవితంలో నువ్వు ఇది సాధించలేవు, నీ వల్ల కాదు అని అవమానించిన వారు మనల్ని చూసి తలదించుకున్నప్పుడే అసలైన శాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నాడు Ravi. ఎవరు ఏమమ్మా వాళ్ళ ముఖంపై ఒక చిరు నవ్వు చిందిస్తే చాలని విశ్వ చెప్పగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో తన గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారన్న అభిప్రాయం లోబో వెల్లడించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి.