ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి పూనమ్‌ కౌర్‌ శుభాకాంక్షలు.. గాల్లోకి పావురాలు

Published : Nov 19, 2021, 05:55 PM ISTUpdated : Nov 19, 2021, 05:57 PM IST
ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి పూనమ్‌ కౌర్‌ శుభాకాంక్షలు.. గాల్లోకి పావురాలు

సారాంశం

గురునానక్‌ జయంతి సందర్భంగా బీజేపీ ఈటల రాజేందర్‌ని కలిసి ఆమె శుభాకాంక్షలు తెలిపారు పూనమ్‌ కౌర్‌. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్‌తో కలిసి గాల్లోకి పావురాలను ఎగరవేశారు. 

హీరోయిన్‌గా మెప్పించి ఇప్పుడు పలు సంచలనాత్మక కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంది పూనమ్‌ కౌర్‌(Poonam Kaur). పవన్‌కి మద్దతుగా కామెంట్లు పెడుతూ మరింతగా హైలైట్‌ అవుతుంది. తాజాగా ఆమె ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన ఈటెల రాజేందర్‌(Etela Rajender)కి అభినందనలు తెలిపింది. ఈటెల నివాసంలో ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.  గురునానక్‌ జయంతి సందర్భంగా బీజేపీ Etela Rajenderని కలిసి ఆమె శుభాకాంక్షలు తెలిపారు పూనమ్‌ కౌర్‌. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్‌తో కలిసి గాల్లోకి పావురాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌తో ఆమె చాలా విషయాలను చర్చించారు. ఆయన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్‌తోపాటు తుల ఉమ, గిరివర్దన్‌ రెడ్డి పాల్గొన్నారు. 

ఈటెల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేసిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవల హుజురాబాద్‌లో ఎన్నికలు జరిగాయి. ఇందులో టీఆర్‌ఎస్‌పై ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పూనమ్‌ కౌర్‌ కలిసి విషెస్‌ తెలపడం విశేషం. తేజ దర్శకత్వంలో రూపొందిన `ఒక విచిత్రం` సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి పరిచయమైంది పూనమ్‌ కౌర్‌.

2006 లోనే తన కెరీర్‌లో రెండో చిత్రం `మాయాజలం`కు సంతకం చేసింది. ఈ సినిమా `ఒక వి చిత్రం` విడుదలకు ముందే రిలీజైంది. దాంతో పూనమ్ కౌర్ తొలి చిత్రం 'మాయాజలం' అయింది. 2007 లో పూనమ్ `నెంజిరుక్కుం వారై` చిత్రంతో తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2008 లో ఆమె `బంధు బలగా` చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగు పెట్టింది. అదే సంవత్సరం, టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్, అనుష్క శెట్టితో కలిసి `శౌర్యం` సినిమా చేసింది. ఈ చిత్రంలో నటనకు ఉత్తమ సహాయ నటిగా పూనమ్.. ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. 

క్యూట్‌ అందాలతో కనువిందు చేసే పూనమ్‌ కౌర్‌ సినిమాల్లోకి రాకముందు ఆమె ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో గ్రాడ్యూయేట్‌ చేసింది. 2006లో మిస్‌ ఆంధ్రా టైటిల్‌ గెలుచుకుంది. దీంతో అందరి దృష్టిని ఆకర్షించింది. పంజాబీ ఫ్యామిలీ అయినప్పటికీ హైదరాబాద్‌లోనే పుట్టిన పూనమ్‌ తెలుగమ్మాయిగా పేరు తెచ్చుకుంది. మోడలింగ్‌ నుంచి సినిమాలపై ఆసక్తితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల నటిగా ఆమె అవకాశాలు లేవు. దీంతో పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది పూనమ్‌. అదే సమయంలో పవన్‌కి సపోర్ట్ చేస్తూ ప్రత్యర్థులపై షాకింగ్‌ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. 

also read: ముందు జిప్ వేసులో... బిగ్ బాస్ బ్యూటీ డ్రెస్ పై నెటిజెన్స్ హాట్ కామెంట్స్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్