బాలయ్య తొలిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కావడంతో Unstoppable With NBK show కి అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రానున్న రోజుల్లో ఈ షోకి అతిథులుగా క్రేజీ సెలెబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి.
ఆహా ఓటిటిలో నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ షోపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ షో తొలి ఎపిసోడ్ కి గెస్ట్ గా Mohan Babu ని రంగంలోకి దించారు.రెండవ ఎపిసోడ్ కి గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని హాజరయ్యాడు.
బాలయ్య తొలిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కావడంతో Unstoppable With NBK show కి అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రానున్న రోజుల్లో ఈ షోకి అతిథులుగా క్రేజీ సెలెబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తదుపరి ఎపిసోడ్ కి కూడా గెస్ట్ ఫిక్స్ అయినట్లు టాక్.
వెండితెరపై బాలయ్య లక్కీ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ ఎమ్మెల్యే రోజా అన్ స్టాపబుల్ షోకి అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ క్రేజీ న్యూస్ అభిమానుల్లో ఉత్కంఠ పెంచేస్తోంది. బాలకృష్ణ, రోజా కాంబినేషన్ అంటే వెంటనే అభిమానులకు బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం లాంటి క్లాసిక్ హిట్స్ గుర్తుకు వస్తాయి. బాలయ్య, రోజా వెండితెరపై సూపర్ హిట్ జోడి. ఈ రెండు చిత్రాలు మాత్రమే కాక బాలయ్యతో రోజా పెద్దన్నయ్య, మాతో పెట్టుకోకు, సుల్తాన్ లాంటి చిత్రాల్లో కూడా రొమాన్స్ చేసింది.
అందుకే రోజా, బాలయ్య మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ రోజాకు బాలయ్య అంటే అభిమానం. కానీ పొలిటికల్ గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం రోజా బాలయ్యపై విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం.
Also Read: హరీష్ శంకర్ 'వేదాంతం రాఘవయ్య' నుంచి సునీల్ అవుట్.. మరో హీరో ఎంట్రీ
అన్ స్టాపబుల్ షోలో బాలయ్య సినిమా విషయాలతో పాటు.. వారి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు, రాజకీయాల గురించి కూడా ప్రస్తావిస్తారు.మోహన్ బాబు అతిథిగా హాజరైనప్పుడు బాలయ్య ఎలాంటి ప్రశ్నలు సంధించారో చూశాం. రాజకీయాలపై వాడి వేడిగా వారి మధ్య చర్చ జరిగింది. మరి రోజాతో కూడా బాలయ్య తనపై చేసిన విమర్శలు, రాజకీయాల్లో జరిగిన వివాదాల గురించి ప్రస్తావిస్తారా? ఒక వేళ రాజకీయాలు చర్చకు వస్తే రోజా ఎలా స్పందిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఏది ఏమైనా రోజా, బాలయ్య ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు అంతకు మించిన మజా ఏముంటుంది!