పవన్,చంద్రబాబు లను టార్గెట్ చేస్తూ మళ్లీ సినిమా,ట్రైలర్ ఇదిగో

By Surya PrakashFirst Published Nov 19, 2021, 5:11 PM IST
Highlights

 తాజాగా ఆర్జీవీ మిస్సింగ్‌ ట్రైలర్‌ ను విడుదల చేశాడు వర్మ. ఈ ట్రైలర్‌ ఏపీ పాలిటిక్స్‌ ను అందం పట్టేలా ఉంది. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ ఓటమి, అలాగే చంద్రబాబు – లోకేష్‌ లను కళ్లకు కటినట్లు చూపించాడు వర్మ. అలాగే.. వర్మను మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం, అతడి కొడుకు కిడ్నాప్‌ చేశారనే కోణంలో సినిమాను తీసినట్లు…. ఈ ట్రైలర్‌ చూస్తే అర్థమమౌవుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గత కొంతకాలంగా సినిమాలు,రాజకీయాలతో పుల్ బిజీ అయ్యారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ నాయకులతో పాటుగా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పవన్ ని టార్గెట్ చేస్తూ ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. వారిలో అత్యంత ప్రముఖుడు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) . ఆ మధ్య అయితే వర్మ పవన్ ని టార్గెట్ చేస్తూ  సినిమాలు తీసాడు. అయితే ఈ మధ్యన ఆయన పవన్ జోలికి వెళ్లలేదు. మళ్లీ ఏమైందో ఏమో కానీ ఇప్పుడు మళ్ళీ టార్గెట్ చెయ్యడం స్టార్ట్ చేసాడు. పవర్ స్టార్ / ఆర్జీవీ మిస్సింగ్ అంటూ ఓ సినిమా చేసి ట్రైలర్(Powerstar/Rgv Missing) వదిలారు. మళ్ళీ పవన్ చంద్రబాబుల డూప్స్ లతో రచ్చ చేస్తున్నారు. ఇప్పుడీ ట్రైలర్ వైరల్ అవుతోంది.

అప్పుడెప్పుడో ఆర్జీవీ మిస్సింగ్‌ అనే సినిమాను తెరపైకి తీసుకువచ్చిన వర్మ…. ఇప్పుడు ఆ సినిమాకు ప్రమోషన్స్‌ మొదలు పెట్టాడు. తాజాగా ఆర్జీవీ మిస్సింగ్‌ ట్రైలర్‌ ను విడుదల చేశాడు వర్మ. ఈ ట్రైలర్‌ ఏపీ పాలిటిక్స్‌ ను అందం పట్టేలా ఉంది. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ ఓటమి, అలాగే చంద్రబాబు – లోకేష్‌ లను కళ్లకు కటినట్లు చూపించాడు వర్మ. అలాగే.. వర్మను మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం, అతడి కొడుకు కిడ్నాప్‌ చేశారనే కోణంలో సినిమాను తీసినట్లు…. ఈ ట్రైలర్‌ చూస్తే అర్థమమౌవుతుంది.

ఇప్పటికే రక్త చరిత్ర, కడప రెడ్లు, చంద్రబాబు వెన్నుపోటు పై సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం కొండా సురేఖ దంపతుల పై సినిమా రూపొందిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేకత సాధించిన కొండా దంపతుల కథాంశం నేపథ్యంలో.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్ ను కూడా విడుదల చేశారు రాంగోపాల్ వర్మ. ఇది ఇలా ఉండగా… ఆ మధ్యన హన్మకొండలో కొండ సినిమా చిత్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా హనుమకొండ లో దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఘన స్వాగతం పలికారు కొండా సురేఖ దంపతులు. మొదట కొండా సురేఖ ఇంటికి వెళ్ళిన వర్మ.. అనంతరం ర్యాలీ నిర్వహించారు. వరంగల్ నుండి వంచనిగిరి వరకు ర్యాలీ నిర్వహించారు వర్మ. 

also read: కిడ్నాప్ కి గురైన రామ్ గోపాల్ వర్మ... పవన్ ఫ్యాన్స్ పై అనుమానం

click me!