పవన్ కల్యాణ్ పై రాజకీయ కుట్ర

First Published Jan 18, 2018, 7:06 PM IST
Highlights
  • పవన్ ఫ్యాన్స్ రక్తం వచ్చేలా కొట్టారని సోషల్ మీడియాలో ప్రచారం
  • అజ్ఞాతవాసి ఫ్లాప్ కు రాజకీయ రంగు పులిమే యత్నం
  • సంబంధం లేని ఫోటోలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దుష్ప్రచారం

పవన్ కల్యాణ్ కు తెలంగాణ ఆంధ్రా అన్న తేడా లేకుండా మాస్ లో ఎంతో ఫాలోయింగ్ వుంది. పవన్ కోసం ఏమైనా చేస్తామంటూ ఫ్యాన్స్ చెబుతుంటారు. ఇటీవల విడుదలైన అజ్ఞాతవాసి సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. దీన్ని ఆసరాగా తీసుకుని సందట్లో సడేమియా అన్నట్లుగా కొన్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కుట్రలు కుతంత్రాలతో పవన్ ఇమేజ్ ను డామేజ్ చేసేలా ప్రవర్తిస్తున్నాయి. పవన్  ఫ్యాన్స్ ను గందరగోళానికి గురిచేస్తున్నాయి.

 

పవన్ ఫ్యాన్స్ ఒక యువకుడిని చితకబాది కనుగుడ్లు పగిలేలా కొట్టారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పనిగట్టుకుని కొందరు ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఆ యువకుడిని కొట్టిన మాట నిజమే కానీ... చిన్న రక్తపు చుక్క కూడా కారలేదు. పైగా ఆ యువకుడు కూడా పవన్ కల్యాణ్ వీరాభిమానే. కాకుంటే సినిమా పై అసంతృప్తితో ఆ యువకుడు పవన్ పోస్టర్ ను చెప్పుతో కొట్టి అవమానించాడు. దీన్ని జీర్ణించుకకోలేకపోయిన ఫ్యాన్స్ ఆ యువకుడిని నాలుగైదు దెబ్బలేసిన తర్వాత అతడికి సర్ది చెప్పారు. కానీ దీన్ని ఆసరాగా తీసుకుని లేనిది వున్నట్లు చిలువలు పలువలుగా  దుష్ప్రచారం చేశారని, ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

 

అసలే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ఉద్దేశంతోనే కనుగుడ్ల నుంచి రక్తాలు వచ్చినట్లు ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టడంలో కుట్ర కోణం దాగుందని చెప్తున్నారు. నిజానికి పవన్ ఫ్యాన్స్ అరాచకాలు సృష్టించదలుచుకుంటే... కత్తి మహేష్ లాంటి దారుణమైన క్రిటిక్ నే ఏమీ అనలేదని గుర్తు చేస్తున్నారు. కేవలం పవన్ కల్యాణ్ ను రాజకీయంగా దెబ్బతీయడం కోసమే ఈ రకమైన కుట్రలకు పాల్పడుతున్నారని పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా కత్తి మహేష్ చేస్తున్న కామెంట్లతో విసుగు చెందినా పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు తప్ప కత్తిపై భౌతిక దాడులకు దిగలేదని అభిమానులు చెప్తున్నారు.

 

అయితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వెనుక కొన్ని రాజకీయ పార్టీల కుట్ర దాగుందని, లేనిది వున్నట్లు వున్నది లేనట్టు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి గందరగోళానికి తెరతీస్తున్నారని పవన్ ఫ్యాన్స్ ఆక్షేపిస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్ బలం చూసి ఓర్వలేకనే లేనివి క్రియేట్ చేసి కుట్రతో వైరల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడిచేసారని చెప్తున్న వీడియో ఇదే...మరోసారి చూడండి.

click me!