హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

By Sumanth Kanukula  |  First Published May 23, 2023, 9:59 AM IST

ప్రముఖ సినీ నటి డింపుల్ హయతిపై పోలీసు కేసు నమోదు అయింది. డింపుల్ హయతితో పాటు ఆమె స్నేహితుడు డేవిడ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 


హైదరాబాద్: ప్రముఖ సినీ నటి డింపుల్ హయతిపై పోలీసు కేసు నమోదు అయింది. డింపుల్ హయతితో పాటు ఆమె స్నేహితుడు డేవిడ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో డింపుల్ హయతి నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో ట్రాఫిక్ డీసీపీగా ఉన్న ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కూడా నివాసం ఉంటున్నారు. అయితే రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్కింగ్ ప్లేస్‌లో డేవిడ్ ఢీ కొట్టాడు. 

అయితే దీనిపై రాహుల్ హెగ్డే వాహన డ్రైవర్ చేతన్ కుమార్ డింపుల్ హయతి, డేవిడ్‌లను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే డింపుల్ హయతి కారును కాలితో తన్ని దూషణకు దిగినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అపార్ట్‌మెంట్ జరిగిన గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తోంది. 

Latest Videos

ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పోలీసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్‌పై 353, 341,279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి డింపుల్ హయతి, ఆమె స్నేహితుడు డేవిడ్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ గొడవ విషయంలో డింపుల్ హయతికి నచ్చజెప్పేందుకు యత్నించిన ఆమె పద్దతి మార్చుకోలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. 

Also Read: జూ. ఎన్టీఆర్ అభిమానుల అత్యుత్సహం.. 9 మంది అరెస్ట్.. ఇంతకీ వారు ఏం చేశారంటే..

ఇక, డింపుల్ విషయానికి వస్తే గల్ఫ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. గద్దలకొండ గణేష్ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో కనిపించారు. ఆ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడీ చిత్రంలో నటించారు. ఇటీవలే ఆమె నటించిన తాజా చిత్రం రామ బాణం విడుదలైంది. ఆమె కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించారు. 

click me!