మంచు విష్ణుకు వరస కౌంటర్లు, అనవసరంగా కెలుక్కున్నాడా

Published : May 23, 2023, 09:44 AM IST
 మంచు విష్ణుకు వరస కౌంటర్లు, అనవసరంగా కెలుక్కున్నాడా

సారాంశం

సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్దితి సెలబ్రెటీలకు ఏర్పడింది. ఎందుకంటే వరస కౌంటర్స్ పడిపోతున్నాయి... మరి 

రీసెంట్ గా  ఆర్‌బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్న సమయంలో విష్ణు తన ట్విటర్‌ ఖాతా వేదికగా నోట్ల గుట్టల ఫొటోను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘‘వెన్నెల కిషోర్‌ ఇంటికి వెళ్లినప్పుడు నేను ఈ ఫొటో తీశాను. రూ.2000 నోట్లతో ఆయన ఏం చేస్తాడా?అని ఆశ్చర్యపోయాను’’ అని పేర్కొన్నారు. దీనికి వెన్నెల కిషోర్‌ సైతం సరదాగా బదులిచ్చారు. ‘‘సరిపోయింది. హీరో, విలన్‌ కొట్టుకుని కమెడియన్‌ని చంపేసినట్టు నామీద పడతారేంటి?’’ అంటూ ‘అత్తారింటికి దారేది’లో ఆహుతి ప్రసాద్‌ చెప్పిన డైలాగ్‌ను షేర్‌ చేశారు. ఇదిలా ఉండగా, విష్ణు - వెన్నెల కిషోర్‌ మధ్య జరిగిన ఈ సంభాషణను ఆధారంగా చేసుకుని పలువురు కథనాలు ప్రచురించారు. దానికి మంచు విష్ణు స్పందించారు. క్లారిటీ ఇచ్చారు.

ఈ మేరకు మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘‘వెన్నెలకిషోర్‌ను ఉద్దేశిస్తూ నేను చేసిన జోక్‌.. కొన్ని న్యూస్‌ పోర్టల్స్‌ వల్ల మరో కోణంలోకి వెళ్తోంది. నాకూ కిషోర్‌కు మధ్య ఫన్నీ ఫైట్స్‌ ఉంటాయనే విషయం చాలా మందికి తెలుసు. హ్యూమర్‌ ఉన్న వాళ్లందరూ నేను సరదాగానే ఆ ఫొటో షేర్‌ చేశానని అర్థం చేసుకున్నారు. ఎవరికైతే ఆ జోక్‌ అర్థం కాలేదో వాళ్లను ఆ భగవంతుడే కాపాడాలి’’ అని ఆయన రాసుకొచ్చారు.  అయితే ఈ క్లారిటీకి చాలా మంది క్రింద రెస్పాండ్ అయ్యారు. నీ ఏజ్ కు ఈ జోక్ లు ఏంటని ఒకరు...నువ్వే ఓ జోకర్ ..నువ్వు ఏది మాట్లాడినా జోకే కదా మళ్లీ చెప్పాలా అని, అయినా చిల్లర పంచాయితీలు ఏంటని..ఇలా వరస పెట్టి మంచు విష్ణుని ఆడుకోవటం మొదలెట్టారు. 

తన ట్వీట్ ని బేస్ చేసుకుని వచ్చిన  వార్తలను ఉద్దేశిస్తూ మంచు విష్ణు తాజాగా ఈ ట్వీట్‌ చేశారు. వెన్నెల కిషోర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, జోక్‌గా తాను ఆ ఫొటో షేర్‌ చేశానని అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం