గాయాలతో బయటపడతారనుకున్నా.. హరికృష్ణ మృతిపై పవన్ కళ్యాణ్!

By Udayavani DhuliFirst Published 29, Aug 2018, 11:58 AM IST
Highlights

సినీ నటుడు హరికృష్ణ మృతి టాలీవుడ్ ని విషాదంలో ముంచేసింది. ఆయన మరణ వార్త విన్న ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు. కారు యాక్సిడెంట్ లో ఈరోజు ఉదయం మరణించిన ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు

సినీ నటుడు హరికృష్ణ మృతి టాలీవుడ్ ని విషాదంలో ముంచేసింది. ఆయన మరణ వార్త విన్న ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు. కారు యాక్సిడెంట్ లో ఈరోజు ఉదయం మరణించిన ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మరణం కార్మాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధికారిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయన మరణంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

''మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి, సినీ నటుడు శ్రీ నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసిన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారు అనుకునేలోగా విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలి. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివి. శ్రీహరికృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుగా వెళ్లే శక్తి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను. నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున శ్రీ హరికృష్ణకి నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు జనసేన కార్యాలయంలో ముఖ్య నాయకులూ చేరికలు, గిడుగు రామమూర్తి జయంతి వేడుకల నిర్వహణ ఉన్నాయి. వాటిని సహృదయులు శ్రీ హరికృష్ణ మృతికి సంతాపసూచకంగా రద్దు చేస్తున్నాం'' అని వెల్లడించారు. 

ఇవి కూడా చదవండి.. 

నా 'సీతయ్య'.. వైవిఎస్ ఎమోషనల్ పోస్ట్!

నా ప్రేమ నీకు ఎప్పటికీ ఉంటుంది తారక్.. మహేష్ ఎమోషనల్ ట్వీట్!

జూనియర్ ఎన్టీఆర్ మాటను హరికృష్ణ పట్టించుకోలేదా..?

Last Updated 9, Sep 2018, 11:13 AM IST