Pawan Kalyan :'రిపబ్లిక్' ఈవెంట్ లో అభిమానిపై పవన్ ఆగ్రహం..'అఖండ' ప్రీరిలీజ్ లో ఊహించని ట్విస్ట్

pratap reddy   | Asianet News
Published : Nov 30, 2021, 02:50 PM IST
Pawan Kalyan :'రిపబ్లిక్' ఈవెంట్ లో అభిమానిపై పవన్ ఆగ్రహం..'అఖండ' ప్రీరిలీజ్ లో ఊహించని ట్విస్ట్

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'రిపబ్లిక్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేసిన ప్రసంగం టాలీవుడ్ లో, ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'రిపబ్లిక్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేసిన ప్రసంగం టాలీవుడ్ లో, ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.  

ప్రీరిలీజ్ ఈవెంట్ లో Pawan Kalyan టాలీవుడ్ సమస్యలు, టికెట్ ధరలపై తీవ్రస్థాయిలో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పవన్ ప్రసంగం మధ్యలో ఓ సంఘటన జరిగింది. ఓ అభిమాని స్టేజిపైకి దూసుకుని పవన్ వద్దకు వచ్చాడు. దీనితో పవన్ కళ్యాణ్ ఆ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా అరిచారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 

పవన్ కళ్యాణ్ తన అభిమానితోనే అనుచితంగా ప్రవర్తించాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. పవన్ తీరుపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఆ సంఘటన విషయంలో పవన్ ని విమర్శించిన వారికి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు ఆయన అభిమానులు. స్టేజిపైకి దూసుకొచ్చిన ఆ వ్యక్తి గురించి ఓ ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. 

వాస్తవానికి రిపబ్లిక్ ఈవెంట్ లో స్టేజిపైకి దూసుకొచ్చిన వ్యక్తి పవన్ అభిమాని కాదట.. ఆరోజు హంగామా చేసిన వ్యక్తే ఇటీవల బాలకృష్ణ 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించాడు. బాలయ్యకు ఫ్లవర్ బొకే ఇస్తూ వేదికపై మెరిశాడు. ఏంటి సంగతి అని పవన్ అభిమానులు ఆరాతీయగా అసలు విషయం బయట పడ్డట్లు తెలిసింది. 

Also Read: క్లాసీ డ్రెస్ లో బోల్డ్ ఫోజులు.. ఇంటర్నెట్ లో ఇషా గుప్తా అందాల తుఫాన్

అతడు ఈవెంట్ మేనేజర్ అట. ఆ రోజు రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు వేదికపైకి వెళ్లినట్లు పవన్ అభిమానులు చెబుతున్నారు. ఈవెంట్ మేనేజర్ కనుకే అఖండ ప్రీరిలీజ్ వేడుకలో కూడా మెరిశాడు అని అంటున్నారు. పవన్ ఎవరిపైనా అనవసరంగా ఆగ్రహం వ్యక్తం చేయడని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read: రాజ్ తరుణ్ కాలో చెయ్యో విరగాలనుకున్నా.. అరియనా సంచలన వ్యాఖ్యలు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Divvala Madhuri: బిగ్‌బాస్‌లో రీతూ రోత పనులు చూడలేకపోయాను, అందుకే ప్రశ్నించాల్సి వచ్చింది
Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?