రాజ్ తరుణ్ కాలో చెయ్యో విరగాలనుకున్నా.. అరియనా సంచలన వ్యాఖ్యలు

pratap reddy   | Asianet News
Published : Nov 30, 2021, 12:32 PM ISTUpdated : Nov 30, 2021, 01:55 PM IST
రాజ్ తరుణ్ కాలో చెయ్యో విరగాలనుకున్నా.. అరియనా సంచలన వ్యాఖ్యలు

సారాంశం

బిగ్ బాస్ 4 అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది. 

బిగ్ బాస్ 4 అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది. ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియాలో ఏం చేసిన వైరల్ అవుతోంది. 

ఇదిలా ఉండగా Anchor Ariyana రీసెంట్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' చిత్రంలో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే తొలి చిత్రం. కానీ అరియనా తాజాగా రాజ్ తరుణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

రాజ్ తరుణ్ అంటే నాకు ఇష్టం లేదు. Raj Tarun కారులో వెళుతుంటే యాక్సిడెంట్ జరిగి కాలో చెయ్యో విరగాలి అని కూడా కోరుకున్నట్లు అరియనా హాట్ కామెంట్స్ చేసింది. అంతలా రాజ్ తరుణ్ ఒక సమయంలో అరియానాకు కోపం తెప్పించాడట. ఒకసారి రాజ్ తరుణ్ ని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. 9 గంటలకే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. కానీ రాజ్ తరుణ్ మధ్యాహ్నం 2 గంటల తర్వాత హాజరయ్యాడు. 

మరో ట్విస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూకి అటెండ్ కాకుండానే తిరిగి అప్పుడే కారులో వెళ్ళిపోయాడు. ఏం జరిగిందని అడిగితే.. సర్ కి డబ్బింగ్ లో కరెక్షన్ ఉందని చెప్పారు. నాకు పట్టరాని కోపం వచ్చింది. ఇక జీవితంలో రాజ్ తరుణ్ ని ఇంటర్వ్యూ చేయకూడదని డిసైడ్ అయ్యా. కానీ నా తొలి చిత్రం రాజ్ తరుణ్ తోనే నటించాల్సి వచ్చింది. షూటింగ్ లో రెండురోజులకే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయినట్లు అరియనా పేర్కొంది. 

Also Read: Sreemukhi: శ్రీముఖికి ఆల్రెడీ పెళ్ళైపోయిందా ? సోషల్ మీడియా పోస్ట్ తో కంగుతిన్న ఫ్యాన్స్

Also Read: 83 Trailer: గెలవడానికే మేమిక్కడ ఉన్నాం.. గూస్ బంప్స్ గ్యారెంటీ

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే