83 Trailer: గెలవడానికే మేమిక్కడ ఉన్నాం.. గూస్ బంప్స్ గ్యారెంటీ

By telugu teamFirst Published Nov 30, 2021, 11:14 AM IST
Highlights

గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ తో ట్రైలర్ 83 అదిరిపోయింది. అసలు అంచనాలే లేకుండా, మీడియా నుంచి విదేశీయుల నుంచి హేళనకు గురవుతూ టీమిండియా జగజ్జేతగా ఎలా అవతరించింది అనేది ఈ చిత్ర కథ.

భారత దిగ్గజ క్రికెటర్స్ లో ఒకరైన మాజీ సారథి కపిల్ దేవ్ టీమిండియాకు తొలి ప్రపంచ కప్ అందించారు. 1983లో ఇండియా ప్రపంచకప్ గెలవడంలో కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలు, బయోపిక్ చిత్రాలు ఇండియన్ స్క్రీన్ పై ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పేదేముంది. క్రికెట్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కూడా అలాంటి చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. 

ఇప్పటికే ఎం ఎస్ ధోని, సచిన్ జీవిత చరిత్రలపై బయోపిక్ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. Kapil Dev జీవిత చరిత్రపై కూడా 83 పేరుతో చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో కపిల్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో Ranveer Singh నటిస్తున్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 83పై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 24న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. 

 

Goosebumps Stuff🔥🔥🔥👍👍

Congratulations and teampic.twitter.com/rQHyDWTCtD

— Vamsi Kaka (@vamsikaka)

తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ తో ట్రైలర్ 83 అదిరిపోయింది. అసలు అంచనాలే లేకుండా, మీడియా నుంచి విదేశీయుల నుంచి హేళనకు గురవుతూ టీమిండియా జగజ్జేతగా ఎలా అవతరించింది అనేది ఈ చిత్ర కథ. కపిల్ దేవ్ టీమిండియాని తన భుజాలపై ఎలా నడిపించాడు అనే అంశాలని దర్శకుడు కబీర్ సింగ్ ఆసక్తికరంగా చూపించబోతున్నారు. 

Also Read: మైండ్ బ్లోయింగ్ హాట్.. డిజైనర్ శారీలో రెచ్చిపోయిన 'అఖండ' బ్యూటీ

అత్యంత కీలకమైన జింబాబ్యే మ్యాచ్ లో త్వరగా నాలుగు వికెట్లు కోల్పోవడం, బాత్ రూమ్ లో ఉన్న కపిల్ దేవ్ ఆ సంగతిని నమ్మక పోవడం లాంటి సన్నివేశాలని దర్శకుడు ఫన్నీగా ఎమోషనల్ గా చూపించారు. ఆటగాళ్లు అప్పట్లో ఇంగ్లీష్ రాక ఎలా ఇబ్బంది పడ్డారో అనే అంశాన్ని ఫన్నీగా చూపించారు. ఇక 1983 ప్రపంచకప్ విజయం కోసం ఆటగాళ్లు పడ్డ కష్టం ఎమోషనల్ గా ఉంటూ ఆకట్టుకుంటోంది. ఇక రణవీర్ సింగ్ మీడియాతో ' ముందే చెప్పాము కదా గెలవడానికే మేమిక్కడ ఉన్నాం అని' అనే డైలాగ్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ.  మొత్తంగా 83 ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. 

 

click me!