
తెలుగు సినీ పరిశ్రమలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, నిర్మాత శరత్ మరార్ మధ్య గల స్నేహం గురించి మనందరికీ తెలిసిందే. వారి మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్ బాండ్ ఉంది. శరత్ మరార్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడని, ఆయనతోనే సినిమాలు తీస్తారనే టాక్ వుంది.
కానీ అలాంటి స్నేహితుల మధ్య ప్రస్తుతం విభేదాలు నెలకొన్నాయనే వార్త ఒకటి తాజాగా మీడియాలోనూ, ఫిలింనగర్‌లోనూ విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. ఆ విబేధాలు నిజమే అనేంతగా కొన్ని సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి.
సాధారణంగా పవన్ కల్యాణ్ ఏ కార్యక్రమం చేపట్టినా అక్కడ శరత్ మరార్ తప్పక ఉంటాడు. కానీ ఇటీవల జనసేన చీఫ్‌గా పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సమయంలో తన మిత్రుడు శరత్ మరార్ కనిపించకపోవడం ఓ చర్చకు దారి తీసింది.
పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ సన్నిహితులని ముద్ర పడిన వారంతా కనిపించారు. త్రివిక్రమ్, అలీ, నిర్మాత సురేష్ బాబు, సినిమా పరిశ్రమకు చెందని పవన్ సన్నిహితులు హాజరయ్యారు. కానీ శరత్ మరార్ మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తాయి.
పవన్ కల్యాణ్, శరత్ మారార్ మధ్య సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు చిత్రాలు చిచ్చు పెట్టాయన్నది ఓ మీడియా కథనం. ఆయా చిత్రాల ఆర్థిక వ్యవహారాల కారణంగా విభేదాలు నెలకొన్నట్టు ప్రచారం జరుగుతున్నది. కాటమరాయుడు చిత్రం దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం, ఆ తర్వాత పంపిణీదారుల గొడవపెట్టడం జరిగింది. అయితే డిస్ట్రిబ్యూటర్ల సెటిల్మెంట్ విషయంలో తగిన విధంగా స్పందించలేదనే కారణంతో పవన్, శరత్ మధ్య గొడవ జరిగిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
పవన్‌తో విభేదాలు లేకుంటే పార్టీ ప్రారంభోత్సవ వేడుకకు హాజరై ఉండేవాడు కాదా? వారి మధ్య విభేదాల కారణంగానే శరత్ హాజరుకాలేదు అనే ప్రశ్నలు ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి.