అనుష్క, విరాట్ ల పెళ్లి ముహూర్తం ఫిక్స్.. సెలవులు కావాలట

Published : Oct 27, 2017, 02:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
అనుష్క, విరాట్ ల పెళ్లి ముహూర్తం ఫిక్స్.. సెలవులు కావాలట

సారాంశం

ఇండియన్ క్రికెటర్ విరాట్ తో బాలీవుడ్ బ్యూటీ అనుష్క ప్రేమాయణం గత కొంత కాలంగా ప్రేమలో వున్న ఈ జంట పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట వచ్చే డిసెంబర్ లో ఇటలీలోని మిలాన్ నగరంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు టాక్

బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ, టీమిండియా కెప్టెన్, క్రికెట్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లిల వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయిందా. ఎప్పుడు? అంటే అవును. డిసెంబర్ లో అని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఇంతకీ విషయమేంటి అంటే... డిసెంబర్‌లో శ్రీలంకతో టీమిండియా సిరీస్‌ ఉంది! ‘సారీ... శ్రీలంకతో సిరీస్‌ ఆడలేను. సెలవులు కావాలి’ అని విరాట్‌ భారత క్రికెట్‌ బోర్డుకు లీవ్‌ లెటర్‌ పెట్టాడు. మాంచి ఫామ్‌లో ఉన్న క్రికెటర్‌ ఇలా సెలవులు అడిగితే ఎలా? అసలు ఎందుకీ సెలవులు? అని ఆరా తీస్తే... అసలుకిటుకు అనుష్క నుంచి బైటపడింది.

 

అనుష్కా శర్మ కూడా సేమ్‌ టైమ్‌లో... అంటే డిసెంబర్‌లో షూటింగులు పెట్టుకోకుండా పర్సనల్‌ లైఫ్‌ కోసం కాల్‌షీట్స్‌ కేటాయించారని తెలిసింది. మేటర్‌ ఏంటి? అని బీటౌన్‌లోనూ చర్చ మొదలైంది. అప్పుడు బయటకొచ్చింది... ఈ ఇయర్‌ ఎండింగ్‌లో (డిసెంబర్‌లో) విరాట్‌–అనుష్కలు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే వార్త! అదీ ఇండియాలో కాదు. ఇటలీలోని మిలాన్‌ సిటీలో.

 

ప్రభాస్‌ ‘మిర్చి’లో హీరో ఇంట్రడక్షన్‌ చూపించిన సిటీనే మిలాన్. వరల్డ్‌ ఫ్యాషన్‌ క్యాపిటల్‌గా మిలాన్‌కు మంచి పేరుంది. బయట ఎన్ని వార్తలు షికార్లు చేస్తున్నా, ఏం స్పందించకుండా ఉండడం విరాట్‌–అనుష్కల స్టైల్‌. ఇప్పుడూ అంతే... పెళ్లి వార్తల గురించి ఏం మాట్లాడడం లేదు.

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌