పి.ఎస్.వి. గరుడవేగ సెన్సార్ రిపోర్ట్

Published : Oct 27, 2017, 06:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
పి.ఎస్.వి. గరుడవేగ సెన్సార్ రిపోర్ట్

సారాంశం

యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గరుడ వేగ గరుడ వేగ మూవీలో సన్నీ లియోని స్పెషల్ సాంగ్ భారీ బడ్జట్ తో తెరకెక్కిన ఈ మూవీలో భారీ యాక్షన్ వుందంటున్న సెన్సార్

తెలుగు సినీ పరిశ్రమలో గత కొంత కాలంగా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కు... సంబందించినంత వరకూ గత కొన్నేళ్లుగా ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన హిట్ సినిమా లేనే లేదు. గరుడ వేగ చిత్రం ప్రస్తుతం ఆయన ఫ్యూచర్ ని నిర్ణయించే చిత్రంగా ఉంది. రాజశేఖర్ భవిష్యత్తు కంటే డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు భవిష్యత్తు కి ఈ సినిమా కీలకం అని చెప్పాలి. చందమామ కథలు లాంటి ఒక సాధారణ కథతో నేషనల్ అవార్డ్ సైతం గెలుచుకున్న డైరెక్టర్ ప్రవీణ్ రెండో సినిమాగా గుంటూర్ టాకీస్ తీసాడు.

 

అది కూడా చిన్న కథ తక్కువ బడ్జెట్ సినిమా అయితే గరుడ వేగ సినిమా కి వచ్చే సరికి ఒక మార్కెట్ లేని రాజశేఖర్ లాంటి హీరోని పెట్టుకుని భారీ బడ్జెట్ తో వచ్చాడు ప్రవీణ్. ఈ సినిమా సెన్సార్ తాజాగా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ తెచ్చుకుంది. పూజా కుమార్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 3వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

 

సెన్సార్ వారి నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం చూస్తే ఈ సినిమాలో ఖచ్చితంగా విషయం ఉంది అంటున్నారు. రాజశేఖర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. నక్షత్ర తాబేళ్ల చుట్టూరా ఈ సినిమా కథ నడుస్తుంది. వాటి స్మగ్లింగ్ దగ్గర నుంచీ వాటికోసం ఎన్నో మర్డర్ లూ, యాక్షన్ సన్నివేశాలూ జరుగుతూ ఉంటాయి. వీటికి అంత సీన్ ఏముంది వాటికోసం అంత హడావిడి ఏంటి అనేది థియేటర్ లో చూడాల్సిందే నట.

 

అయితే సినిమా ఫస్ట్ హాఫ్ సైలెంట్ గా స్లో గా స్టార్ట్ అవుతూ సూపర్ యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది, సెకండ్ హాఫ్ లో నక్షత్ర తాబేళ్ల గురించీ వాటితో హీరోకి ఉన అనుబంధం, అతని గతం ఏంటి అనేవి ఉంటాయి. క్లైమాక్స్ కి చేరుకునే సరికి సినిమా కాస్త డౌన్ ఫాల్ కి వచ్చింది అనీ ప్రవీణ్ సత్తారు చేస్తున్న అతిపెద్ద రిస్క్ ఈ సినిమా అనీ అంటున్నారు. భారీ బడ్జెట్ పెట్టేసి రాజశేఖర్ లాంటి హీరోని నమ్ముకున్నారు నిర్మాతలు. మరి చివరికి నిర్మాతలకు చివరకు సినిమా ఏం ఇస్తుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌