`భీమ్లా నాయక్‌` నుంచి మరో సాంగ్‌.. `అడవి తల్లి మాట` అంటోన్న పవన్‌, రానా

పవన్‌ కళ్యాణ్‌, రానా కలిసి నటిస్తుండటంతో `భీమ్లా నాయక్‌` అందరిలోని ఆసక్తిని రేకెత్తించింది. పాటలు, గ్లింమ్స్ సైతం ఆకట్టుకోవడం సినిమాకి మరింత ప్లస్‌ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలయ్యాయి.


పవన్‌ కళ్యాణ్‌(Pawan kalyan), రానా(Rana) కలిసి నటిస్తున్న `భీమ్లా నాయక్‌`(Bheemla Nayak) చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింమ్స్ సినిమాలపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా `భీమ్లానాయక్` టైటిల్‌ సాంగ్‌ సైతం ఊపుతీసుకొచ్చింది. అంతకు ముందు వచ్చిన గ్లింప్స్ సైతం ఆకట్టుకున్నాయి. పవన్‌ పాత్ర అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంటుందనే సిగ్నల్స్ ఇచ్చింది. దీంతో సినిమా కోసం ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు పవన్‌, రానాల అభిమానులు. 

పవన్‌ కళ్యాణ్‌, రానా కలిసి నటిస్తుండటంతో Bheemla Nayak అందరిలోని ఆసక్తిని రేకెత్తించింది. పాటలు, గ్లింమ్స్ సైతం ఆకట్టుకోవడం సినిమాకి మరింత ప్లస్‌ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలయ్యాయి. ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని నాల్గో పాట రాబోతుంది. రేపు శనివారం(డిసెంబర్‌ 4)ని విడుదల చేయబోతున్నారు. `అడవి తల్లి మాట`(Adavi Thalli Maata) పేరుతో సాగే ఈ పాటని రేపు ఉదయం 10.08గంటలకు విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. `భీమ్లా నాయక్‌` సినిమా సారాంశాన్ని తెలిపేలా ఈ పాట ఉండబోతుందని తెలిపింది. 

Latest Videos

ఇదిలా ఉంటే ఈ పాటలో ఇటు Pawan Kalyan, అటు రానా  కూడా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. వారిద్దరి మధ్య సంఘర్షణని చూపించేబోతున్నట్టుగా తాజాగా యూనిట్‌ విడుదల చేసిన పోస్టర్‌ని చూస్తే అర్థమవుతుంది. ఇక `భీమ్లా నాయక్‌` చిత్రానికి సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇందులో పవన్‌ సరసన నిత్యా మీనన్‌, రానా సరసన సంయుక్త మీనన్‌ నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. 

అయితే సినిమా విడుదలై పలు మార్లు యూనిట్‌ క్లారిటీ ఇచ్చినా ఇంకా సస్పెన్స్ నెలకొంది. ఇది వెనక్కి వెళ్తుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంటే, ఇప్పుడు సినిమా ఇంకా ముందుకు రాబోతుందనే మరో వార్త వైరల్‌గా మారింది. డిసెంబర్‌లోనే రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారనే టాక్‌ కూడా ఉంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

also read: సెట్స్ పైకి వెళ్లకుండానే పవన్, సురేందర్ రెడ్డి చిత్రానికి కళ్ళు చెదిరే డీల్!

click me!