కన్నీరు పెట్టిస్తున్న కిరణ్ అబ్బవరం పోస్ట్.. సోదరుడి మృతిపై తీవ్ర భావోద్వేగంతో..

pratap reddy   | Asianet News
Published : Dec 03, 2021, 04:53 PM IST
కన్నీరు పెట్టిస్తున్న కిరణ్ అబ్బవరం పోస్ట్.. సోదరుడి మృతిపై తీవ్ర భావోద్వేగంతో..

సారాంశం

టాలీవుడ్ లో యువ హీరో Kiran Abbavaram ఇప్పుడిపుడే గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు. కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో యువ హీరో Kiran Abbavaram ఇప్పుడిపుడే గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు. కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనితో ఈ యువ హీరో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కడప జిల్లా చెన్నూరు ప్రాంతంలో రామాంజులు రెడ్డి కారులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. కారు ధ్వంసం అయ్యేలా ప్రమాదం జరిగింది. 

దీనితో రామాంజులు రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో మరణించారు. తాజాగా కిరణ్ అబ్బవరం తన సోదరుడి మృతి పట్ల భావోద్వేగానికి గురవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 'ఒరేయ్ కిరా.. మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదురా. మన ఇద్దరిలో ఎవరో ఒకరం గట్టిగా సాధించాలిరా' అని మా అన్నయ్య ఎప్పుడూ నాతో అంటూ ఉండేవాడు. ఎంతగానో సపోర్ట్ చేశాడు . 

నన్ను అందరికి ఎప్పుడు పరిచయం చేస్తావు అని అడిగేవారు. ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నాను అనుకునేలోపు ఆయన పక్కన లేకుండా పోయారు. కానీ మా అన్నయ్యని ఇలా పరిచయం చేయాల్సి వస్తుంది కలలో కూడా ఊహించలేదు అని కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 

ఇటీవల టాలీవుడ్ లో శివశంకర్ మాస్టర్ , సిరివెన్నెల లాంటి ప్రముఖుల మృతితో విషాదం నెలకొంది. కిరణ్ అబ్బవరం సోదరుడి మృతి కూడా ఇండస్ట్రీకి మరోషాక్. 'రాజాగారు రాణి వారు' చిత్రంతో కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రం కూడా విడుదలయింది.

Also Read: టికెట్ ధరలపై ప్రభుత్వాన్ని ఏకిపారేసిన సిద్ధార్థ్.. మందు, సిగరెట్ పైన ఉండే శ్రద్ధ సినిమాపై లేదు

PREV
click me!

Recommended Stories

నిర్మాత నాగవంశీకి ఏ హీరోయిన్ పై క్రష్ ఉందో తెలుసా.. దుబాయ్ వెళ్ళేది అందుకే, ఏదో ఊహించేసుకుంటారు
హీరో నువ్వా నేనా, బాలయ్య ముఖం మీదే అడిగేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్.. సినిమా దొబ్బింది అని అప్పుడే అర్థమైంది