విక్టరీ వెంకటేశ్ మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ప్రయత్నిస్తోన్నట్టు టాక్. ఈ చిత్రంలో రానా - వెంకీలు ప్రధాన పాత్రల్లో నటించబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఒక భాషలో హిట్ అయినా చిత్రాన్ని భాషలో రీమేక్ చేసి విజయాలను అందుకుంటున్నారు హీరోలు. తెలుగులోనూ ఇలాంటి చిత్రాలు తక్కువేం కాదు. ఇప్పుడు చిన్న హీరోల నుంచి బడా హీరోల వరకు అందరూ రీమేక్స్ పై దృష్టి సారిస్తున్నారు. తెలుగు సార్ట్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా రీమెక్ చిత్రాలపై దృష్టి పెట్టాడు. తాజాగా మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ అనే చిత్రాన్ని తెలుగు లో గాడ్ ఫాదర్ పేరుతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అలాగే కింగ్ నాగార్జున కూడా కోలీవుడ్‌లో సూపర్ మూవీ ‘విక్రమ్ వేద’ సినిమాలో తెలుగులో రీమేక్ చేయడానికి సిద్థంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక తెలుగులో మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇదే పంథాలో నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు తెలుగులో చాలా రీమేక్ చిత్రాల్లో నటించి.. మంచి హిట్లను సాధించారు. రీమేక్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఆయన చేసినన్నీ రీమేక్ చిత్రాలు టాలీవుడ్ లో ఎవ్వరూ చేయలేదనడంతో ఎలాంటి అతియోశక్తి లేదు.
Read Also: https://telugu.asianetnews.com/entertainment/disney-hotstar-to-go-legal-against-makers-of-drishyam-2-r2utuv
కరోనా కాలంలో తమిళంలో హిట్ అయిన మూవీనీ తెలుగులో నారప్ప గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకున్నాడు. నారప్ప సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా..రెస్పాన్స్ అదిరిపోయింది. తాజాగా మరో రీమేక్ చిత్రంలో నటించారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన దృశ్యం సినిమాకు సిక్వెల్ గా దృశ్యం 2 అనే రీమేక్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి అదిరిపోయే రెస్పాన్స్ పొందాడు.
Read Also: https://telugu.asianetnews.com/entertainment/update-on-pushpa-hindi-release-r3j68y
ఈ క్రమంలో మరో రీమేక్ పై కన్నేశాడు వెంకీ . మలయాళంలో సూపర్ హిట్ అయినా.. ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తోన్నట్టు టాక్. పృథ్వీరాజ్ – సూరజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బాబాయి- అబ్బాయిలు వెంకీ – రానా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ వారు తీసుకున్నారని టాక్ వినిపించడంతో మళ్లీ ఈ చిత్రంపై రూమర్స్ గుప్పుమన్నాయి. ఈ పుకార్లలో ఎంత వరకూ నిజమోంత ఉందో? ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారో తెలుసుకోవాలంటే..? అధికారిక ప్రకటన వచ్చేవరకూ వేచి ఉండాల్సిందే.