జనసేనాని అమెరికా పర్యటన షెడ్యూల్ వివరాలు

Published : Feb 09, 2017, 01:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
జనసేనాని అమెరికా పర్యటన షెడ్యూల్ వివరాలు

సారాంశం

అమెరికాలో ల్యాండైన పవన్ కళ్యాణ్ బోస్టన్ లో  ఇండియా కాన్ఫరెన్స్ 2017లో పాల్గొననున్న జనసేనాని మూడు రోజులు అమెరికాలో బిజీ బిజీ షెడ్యూల్  

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమెరికా చేరుకున్నారు. బోస్టన్ కాలమానం ప్ర‌కారం తొమ్మిదో తేదీ ఉదయం పది గంటలకు న్యూక్లియర్ అండ్ యాంటి న్యూక్లియర్ ప్రొఫెసర్ మాధ్యూబన్ లో గంటసేపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చర్చలు జరుపుతారు. ఎనర్జీ పాలసీ రూపకల్పనలో నిపుణుడైన ప్రొఫసర్ హెన్రీలీ లో 11 నుంచి 12 గంటల వరకు సంభాషిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తున్న ఈడీఎక్స్ సంస్థ సీఈఓ అనంత్ అగర్వాల్ లలో మధ్యాహ్నం సమావేశమవుతారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆర్గనైజ్ క్యాంపెయిన్ లో ప్రొఫెసర్ అయిన మార్తల్ గంజ్ లో ప‌వ‌న్ సమావేశం ఉంటుంది.



10వ తేదీ ఉదయం 8 గంటలకు బోస్టన్ రాష్ట్రంలోని సీబ్రూక్ న్యూక్లియర్ ప్లాంట్ ను సందర్శించి అక్కడ నిపుణులతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మాట్లాడతారు. సుమారు రెండు గంటల సేపు ప‌వ‌న్ అక్కడ గడుపుతారు. 11.45 నిమిషాలకు కాన్కార్టర్ లోని హాంప్ ఫైర్ సైట్ హౌస్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు, అమెరికా న్యూక్లియర్ పాలసీ రూపకర్తలలలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సర్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పాల్గొంటారు. రెండు తరువాత హాంప్ ఫైర్ గవర్నర్ లో స‌మావేశం అవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నార్తర్ హాంప్ ఫైర్ లోని నషువా సిటి చేరుకొని అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు, తెలుగుఆడపడుచు లత మంగిపూడి గారితో ప‌వ‌న్‌ సమావేశం జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు నషువా లోని రివర్ యూనివర్సిటీ దగ్గర భారతీయ సంతతివారు నిర్వహిస్తున్న కార్ ర్యాలిలో పాల్గొంటారు. అనంతరం ఎన్నారైలు ఏర్పాటు చేసిన డిన్నర్ రిసెప్టన్ స్థలికి చేరుకుంటారు. అక్కడ పూర్ణకుంభంలో పవన్ కళ్యాణ్ ను స్వాగతిస్తారు. తెలుగు లలిత కళావైభవానికి చిహ్నమైన కూచిపూడి నృత్య ప్రదర్శనను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డెమోక్రాటిక్ రిపబ్లికన్ పార్టీలకు చెందిన సెనేటర్లు, నషువా మేయర్, ఎన్నారైల‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.



11 వ తేదిన హార్వర్డ్  యూనివర్సిటీలో "బికమింగ్ జనసేనాని " అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు రాత్రికి పవన్ కళ్యాణ్ ను గౌరవిస్తూ హార్వ‌ర్డ్ యూనివర్సిటీ డిన్ నితిన్ నోట్రాయా తాజ్ బోస్టన్ లో విందు ఇస్తారు. 

చివరగా 12వ తేదిన బోస్టన్ కాలమానం హార్వర్డ్‌ యూనివర్సిటీలో కీనోట్ ప్రసంగం చేస్తారు. సహజంగా ఇక్కడ ఉపన్యాసకులకు అరగంట సేపు మాత్రమే సమయం కేటాయిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ కు సుమారుగా గంట సమయాన్ని నిర్వాకులు కేటాయించడం గమనార్హం. 11, 12 ఇదే సమావేశాల్లో పాల్గొనడానికి భార‌త‌దేశం నుంచి వస్తున్న ఎస్.వై.ఖురేషి,ఒమర్ అబ్దుల్లా , కృష్ణ బైరేగౌడ, శశిథ‌రూర్ , గురురాజ్ దేశ్ పాండే, నితిన్ నోహ్రీయా త‌దిత‌రుల‌తో స‌మావేశం అవుతారు. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు బోస్టన్ నుంచి హైదరాబాద్ కు  పవన్ కళ్యాణ్ తిరుగు పయనమవుతారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: ఆరో వారం ఓటింగ్‌ రిజల్ట్.. ఎలిమినేట్‌ అయ్యేది ఆమెనే?
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?