అనన్యగా తాప్సీ తప్పక ఆకట్టుకుంటుంది!

Published : Feb 09, 2017, 01:21 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
అనన్యగా తాప్సీ తప్పక ఆకట్టుకుంటుంది!

సారాంశం

రానా ఘాజీలో అనన్యగా నటిస్తున్న తాప్సీ పన్ను అనన్య పాత్రలో అలరిస్తుందంటున్న చిత్ర యూనిట్ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందన్న నిర్మాతలు

నవతరం కథానాయికల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. బాలీవుడ్ లోనూ రాణిస్తున్న భామ తాప్సీ. నిన్నటివరకూ గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన తాప్సీ, "పింక్" మొదలుకొని అన్నీ వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకొంటూ నటిగా మంచి గుర్తింపు సాధించింది. తాప్సీ నటించిన తాజా చిత్రం "ఘాజి". ఈ చిత్రంలో రెఫ్యూజీగా "అనన్య"గా తాప్సీ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందని "ఘాజి" చిత్ర బృందం చెబుతోంది.

 

ఈనెల 17న విడుదలకానున్న "ఘాజి"కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన "టీజర్"కు విశేషమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా.. సదరు టీజర్ కు మెగాస్టార్ చిరంజీవిగారు చెప్పిన వాయిస్ ఓవర్ కు చాలా మంచి రెస్పాన్స్ లభిస్తోందని, ఇదే తరహా రెస్పాన్స్ థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి!

PREV
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?