RRR Trailer Promo: మాటు వేసి వేటాడుతున్న ఎన్టీఆర్...

By team telugu  |  First Published Dec 8, 2021, 1:32 PM IST

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆర్ ఆర్ ఆర్ యూనిట్ చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. ట్రైలర్ నుండి భీమ్ ప్రోమో విడుదల చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ పై దూసుకుపోతున్న ఎన్టీఆర్, మరో షాట్ లో నీటిలో దాగి వేటాడుతున్నారు. 



ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ (RRR Trailer)కోసం యావత్ భారత దేశం ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. అందరి నిరీక్షణకు మరో 24 గంటల్లో తెరపడనుంది. డిసెంబర్ 9న ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆర్ ఆర్ ఆర్ యూనిట్ చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. ట్రైలర్ నుండి భీమ్ ప్రోమో విడుదల చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ పై దూసుకుపోతున్న ఎన్టీఆర్, మరో షాట్ లో నీటిలో దాగి వేటాడుతున్నారు. సెకండ్స్ వ్యవధిలో ముగిసిన ఈ రెండు షాట్స్ గూస్ బంప్స్ కలిగించేవిగా ఉన్నాయి. 


ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ పోస్టర్స్ బీభత్సం సృష్టించగా... తాజా ప్రోమో ఆ అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లింది. మరి అంచనాలకు మించిన అవుట్ ఫుట్ ఇవ్వడంలో దిట్టైన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ తో ఎంతటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి. ఈవెనింగ్ చరణ్ (Ram Charan)అల్లూరి ట్రైలర్ ప్రోమో కూడా విడుదల కానుందని సమాచారం. 

Latest Videos


ట్రైలర్ విడుదలకు ముందు ఆర్ ఆర్ ఆర్ టీమ్ నుండి వస్తున్న ఈ సర్పైజ్ లు ఫ్యాన్స్ లో ఆసక్తిరేపుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీనితో ప్రొమోషన్స్ జోరు పెంచారు. ఐదు భాషల్లో విరివిగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. రేపు ముంబై వేదికగా ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పాల్గొననున్నట్లు సమాచారం. 

Also read RRR Movie: రక్తపు మరకలు, ఉక్కు కండలతో ఎన్టీఆర్.. మైండ్ బ్లోయింగ్ పోస్టర్
అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లో ఆర్ ఆర్ ఆర్  ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. సినిమా స్థాయికి తగ్గట్లుగా ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు. డివివి దానయ్య రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మిస్తున్నారు. రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా... అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తున్నారు. జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also read RRR Movie: సిక్స్ ప్యాక్‌లో రామ్‌చరణ్‌ నెవర్‌ బిఫోర్‌ లుక్‌.. ఈ రేంజ్‌లో ఉంటే ఫ్యాన్స్ కి పండగే
 

click me!