Varun Tej Ghani: వరుణ్ తేజ్ ‘గని’ విడుదల తేది ఖరారు

Surya Prakash   | Asianet News
Published : Dec 22, 2021, 01:52 PM IST
Varun Tej Ghani: వరుణ్ తేజ్ ‘గని’ విడుదల తేది ఖరారు

సారాంశం

ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి లాంటి ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు నటిస్తుండడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లకు మంచి ఆదరణ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. 


గద్దల కొండ గణేష్ సినిమా మూవీతో మంచి సక్సెస్  సాధించాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఆ సినిమా తర్వాత… గని మూవీలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. 

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోనే వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ కథల ఎంపికలో  కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. తొలి చిత్రాల కథల విషయంలో తడబడ్డ.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టిన వరుణ్ కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టాడు. దీంతో వరుస విజయాలను వరుణ్ సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా గని అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ చాలా సార్లు వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ని మరోసారి ఫైనల్ చేసారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రియల్ 1,2021న విడుదల కానుంంది. ఈ సినిమాతో బాక్సర్ పాత్రలో నటించనున్నాడు వరుణ్. గని సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది.  మొత్తంగా మెగా హీరోలందరు ఒక్కొక్కరుగా తమ సినిమాల విడుదల తేదిలను ఖరారు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు.

‘గని’ సినిమాలో వరుణ్‌ తేజ్‌కు  జోడిగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వరుణ్ తేజ్‘గని’ సినిమాతో పాటు ఎఫ్ 2 మూవీకి సీక్వెల్‌గా ఎఫ్ 3 మూవీ చేస్తోంది. ఈ సినిమాలో మరోసారి వెంకటేష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.  
 

PREV
click me!

Recommended Stories

Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే
2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్