యుఎస్ లో వన్ మిలియన్ క్లబ్ లో చేరిన జై లవకుశ

Published : Sep 24, 2017, 07:24 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
యుఎస్ లో వన్ మిలియన్ క్లబ్ లో చేరిన జై లవకుశ

సారాంశం

ఈ వారం విడుదలై కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తున్న జై లవకుశ యుఎస్ లో వన్ మిలియన్ క్లబ్ లో చేరిన జై లవకుశ త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్

యంగ్ టైగ ర్ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవ కుశ' కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు అందుకుంటోంది. జనతా గారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత తారక్ తాజాగా మరో మిలియన్ డాలర్స్ మూవీని సొంతం చేసుకున్నాడు. తారక్ కెరీర్‌లో మిలియన్ డాలర్స్ క్లబ్‌లో చేరిన ఐదవ సినిమా ఇది.
 

జై లవ కుశ కూడా అమెరికాలో మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించిన సినిమాల క్లబ్‌లో చేరింది. గతంలో ఎన్టీఆర్ కెరీర్‌లో బాద్‌షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలు మిలియన్ డాలర్స్ క్లబ్‌లో చేరిన సినిమాల జాబితాలో వున్నాయి. ఇదిలావుండగా తాజాగా జై లవ కుశ సినిమా కూడా రిలీజైన మొదటి మూడోరోజే మిలియన్ డాలర్స్ క్లబ్‌లో చేరిపోయింది.


యంగ్ టైగర్ మొదటిసారి చేసిన త్రిపాత్రిభినయానికి ఆడియెన్స్ నుంచి కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రలు వేటికవే ప్రత్యేకమైన ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. అంతేకాకుండా.. ఎన్టీఆర్ వేసిన అదిరిపోయే స్టెప్పులు, డీఎస్పీ రాకింగ్ బీట్స్ వంటివన్నీ జై లవ కుశని ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా చేశాయి. దీంతో కలెక్షన్స్ విషయంలోనూ తారక్ సినిమా  దూసుకుపోతోంది.

PREV
click me!

Recommended Stories

Mysaa Glimpse Review: అడవిలో గర్జించిన రష్మిక మందన్న.. `మైసా` మూవీ ఫస్ట్ గ్లింప్స్ జస్ట్ గూస్‌ బమ్స్
కాంతార 1 రికార్డుకు గండి కొట్టిన ధూరందర్.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ?