Akhanda: ఎదిరించి నిలిచిన బాలయ్య...!

By team teluguFirst Published Dec 7, 2021, 4:03 PM IST
Highlights


బాలకృష్ణ అఖండ (Akhanda) మూవీ కలెక్షన్స్ అన్ స్టాపబుల్ అన్నట్లు ఉన్నాయి. విడుదలై 5 రోజులు గడుస్తున్నా థియేటర్స్ వద్ద హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకున్న అఖండ జోరు కొనసాగిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్స్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత విడుదలైన పెద్ద చిత్రం అఖండ. దీంతో కలెక్టన్స్ పై ప్రభుత్వ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లు ఆశాజనకంగా ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే సినిమాలో సత్తా ఉంటే ధరలతో సంబంధం లేకుండా లాభాలు దక్కుతాయని అఖండ నిరూపిస్తుంది. 


ఏపీలో అఖండ వసూళ్ల జోరు మామూలుగా లేదు. ఐదు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అఖండ రూ. 41.14 షేర్, 64.8 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ వసూళ్లలో డెభై శాతం వరకు ఆంధ్రా నుండి దక్కినవే. దాదాపు రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అఖండ వీకెండ్ ముగిసే నాటికే బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది. బాక్సాఫీస్ వద్ద అఖండకు పోటీ కూడా లేని నేపథ్యంలో ఈ మూవీ భారీగా లాభాలు తెచ్చిపెడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి


 తాజా గణాంకాలు పరిశీలిస్తే ఏపీలో టికెట్స్ ధరల ప్రభావం అఖండ మూవీపై చూపించలేదని అర్థం అవుతుంది. ఈ పరిణామం విడుదలకు సిద్ధంగా ఉన్న.. పుష్ప, ఆర్ ఆర్ ఆర్ , రాధే శ్యామ్ వంటి భారీ చిత్రాల నిర్మాతలలో ధైర్యం నింపింది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తరుణంలో టికెట్స్ ధరల తగ్గింపు వలన జరిగే నష్టం ఏమీ లేదని స్పష్టమైంది. 

Also read Unstoppable: మహేష్ తో “అన్‌స్టాపబుల్” రిలీజ్ డేట్
ఇక బాలయ్య కెరీర్ లో రికార్డు వసూళ్ల దిశగా అఖండ వెళుతుంది. అఖండ బాలయ్య (Balakrishna)ను వందల కోట్ల క్లబ్ లో చేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా అఖండ రూ. 80 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్ సీస్ లో బాలయ్య సినిమాలకు అంతగా మార్కెట్ ఉండదు. పుష్ప మాత్రం నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో దుమ్మురేపుతోంది. 

Also read Akhanda:'అఖండ' సోమవారం టెస్ట్ పాసైందా? షాకింగ్ నిజం

click me!