Unstoppable: మహేష్ తో “అన్‌స్టాపబుల్” రిలీజ్ డేట్

Surya Prakash   | Asianet News
Published : Dec 07, 2021, 02:33 PM IST
Unstoppable: మహేష్ తో  “అన్‌స్టాపబుల్” రిలీజ్ డేట్

సారాంశం

 ఆహా వేదికగా అన్‌ స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే పేరుతో ప్రసారమవుతోన్న ఈ షోలో ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ వచ్చాయి.  పదునైన ప్రశ్నలతో స్టార్స్ నుంచి నిజాలు రాబట్టి బాలకృష్ణ ఆకట్టుకుంటున్నారు.  

టైటిల్ కు తగ్గట్లే అన్‌ స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే ....అన్‌ స్టాపబుల్‌ గా సాగిపోతున్న సంగతి తెలిసిందే. ఓటీటీలో టాక్‌ షో తీసుకొచ్చింది తొలి తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. అంతటితో ఆగకుండా ఏకంగా బాలకృష్ణతోనే టాక్‌ షోను నిర్వహించి ఎవరూ ఊహించని చిత్రానికి తెర తీసింది. అప్పటి వరకు కేవలం ఇంటర్వ్యూలు ఇవ్వడమే తెలిసిన బాలకృష్ణ తొలిసారి ఇతరులకు ప్రశ్నలు సంధిస్తూ అదరకొడుతున్నారు. 

ఆహా వేదికగా అన్‌ స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే పేరుతో ప్రసారమవుతోన్న ఈ షోలో ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ వచ్చాయి.  పదునైన ప్రశ్నలతో స్టార్స్ నుంచి నిజాలు రాబట్టి బాలకృష్ణ ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే నాలుగో ఎపిసోడ్‌లో భాగంగా  సూపర్  స్టార్‌ మహేష్ ని రంగంలోకి దింపారు. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి అభిమానులు ఆ ఎపిసోడ్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ షోలో సినీ నటులు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి కనిపించారు. ఇప్పుడు వీరికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తోడయ్యాడు. తాజాగా ఎన్‌బికెతో “అన్‌స్టాపబుల్ షూటింగ్ సమయంలో బాలకృష్ణతో కలిసి ఉన్న ఫోటోను మహేష్ పంచుకున్నారు. “నా సాయంత్రాన్ని ఎన్బీకే గారితో ‘అన్‌స్టాపబుల్’గా ఆనందించాను” అంటూ చెప్పుకొచ్చారు. నిన్నటితో షూటింగ్ పూర్తయింది. ఈ ఎపిసోడ్‌ ని చూసేందుకు ఇరువురు నటుల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఈ నెల 17న విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విషయమై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు.

Also read EMK: పూరి జగన్నాధ్ స్టైల్ లో 'సర్కారు వారి పాట'.. మహేష్ భలే సంగతి చెప్పాడే

మామూలుగానే మహేశ్ బాబు.. ఇండస్ట్రీలోని ప్రతీ హీరోతో  క్లోజ్‌గా ఉంటారు. మహేశ్ ఇప్పటివరకు ఎక్కువగా బుల్లితెరపై అలరించలేదు. ఆయన అవార్డ్ ఫంక్షన్స్‌కు రావడం కూడా చాలా తక్కువ. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోలు సైతం, బుల్లితెరపై, ఓటీటీల్లో అభిమానులను అలరించడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో మహేశ్ కూడా మనసు మార్చుకుని బుల్లితెరపై కనిపిస్తూ అలరిస్తున్నారు.  ఇటీవల ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయ్యింది.  

Also read Unstoppable With NBK: ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై హాట్ కామెంట్స్.. బోయపాటి ముందే బాలయ్య కంటతడి

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌