Prabhas: వరద బాధితుల కోసం ప్రభాస్‌.. భారీ విరాళం..

Published : Dec 07, 2021, 12:35 PM ISTUpdated : Dec 07, 2021, 12:42 PM IST
Prabhas: వరద బాధితుల కోసం ప్రభాస్‌.. భారీ విరాళం..

సారాంశం

సాయం చేయడంలో ప్రభాస్ చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటారు ప్రభాస్. గతంలో ఎన్నోసార్లు సాయం చేసారు ప్రభాస్. తాజాగా మరోసారి ఇదే చేసారు.

ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుంటుంది చిత్ర పరిశ్రమ. అందులో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు తారలు. ఏపీ వరల బాధితుల కోసం తమ వంతు విరాళాలు అందిస్తున్నారు. ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. చాలా మంది నిరాశ్రయులయ్యారు. అన్నింటిని కోల్పోయారు. ఊహించిన తుఫాన్‌, వరదలు అక్కడ ప్రజలను, జనజీవనాన్ని అస్థవ్యస్తం చేసింది. 

దీంతో ఇప్పటికే స్పందించారు సెలబ్రిటీలు. చిరంజీవి, రామ్‌చరణ్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ స్పందించారు. తలా రూ.25లక్షల విరాళాలు ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి విరాళంగా అందిస్తున్నట్టు వెల్లడించారు. వీరితోపాటు గీతా ఆర్ట్స్ సంస్థ కూడా స్పందించి పదిలక్షల విరాళం ప్రకటించింది. ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్న ప్రభాస్‌(Prabhas) స్పందించారు. తనదైన స్టయిల్‌లో ఆయన భారీ విరాళం ప్రకటించారు. ఏకంగా రూ.కోటి విరాళంగా ఏపీ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్టు వెల్లడించారు. 

సాయం చేయడంలో Prabhas చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటారు ప్రభాస్. గతంలో ఎన్నోసార్లు సాయం చేసారు ప్రభాస్. తాజాగా మరోసారి ఇదే చేసారు. ఆంధ్రప్రదేశ్‌ను ఈ మధ్య కాలంలో అనుకోని వర్షాలు, వరదలు మంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు, ప్రభుత్వం. వాళ్లను ఆదుకోడానికి ఏపీ గవర్నమెంట్ కూడా తమదైన సాయం చేస్తున్నారు. మరోవైపు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది హీరోలు, నిర్మాతలు సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందిస్తున్నారు.

తాజాగా ప్రభాస్ కూడా కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కూడా ప్రభాస్‌ భారీగానే విరాళాలు అందచేసారు. హైదరాబాద్ వరదల సమయంలో కూడా కోటి రూపాయలు అందించారు. కరోనా సమయంలో ఏకంగా 4.5 కోట్ల విరాళం అందించారు. ఇలా అవసరం అనుకున్న ప్రతీసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు రెబల్ స్టార్. ఈయన పెద్ద మనసుకు అభిమానులతో పాటు అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రమిది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. పీరియడ్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 14న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, రెండు పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. వీటితోపాటు `ఆదిపురుష్‌`, `సలార్‌` చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్‌.

also read: ఏపీ వరద బాధితుల కోసం కదిలిన టాలీవుడ్‌.. చిరంజీవి, రామ్‌చరణ్‌, మహేష్‌ విరాళాలు..

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్