
నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. సీనియర్ హీరోల్లో ఇప్పుడు ఆయనే సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. చిరంజీవికి ఒక హిట్, రెండు ఫ్లాపులు అనేలా ఉంది. నాగార్జున చాలా రోజుల తర్వాత `నాసామిరంగ`తో కాస్త రిలాక్స్ అయ్యాడు. వెంకీ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. కానీ ఇటీవల గ్లింప్స్ విడుదల చేయగా, అది దుమ్మురేపేలా ఉంది. బాలయ్య మార్క్ మాస్, యాక్షన్ మేళవిస్తూనే సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు బాబీ.
శరవేగంగా చిత్రీకరిస్తున్న ఈ మూవీలో భారీ కాస్టింగ్ యాడ్ అవుతుంది. ఇప్పటికే విలన్ పాత్ర కోసం `యానిమల్` విలన్ బాబీ డియోల్‌ని తీసుకున్నారు. ఆయన షూటింగ్‌లోనూ పాల్గొన్నారు. బాలయ్యతో బాబీ డియోల్ అంటేనే రచ్చ వేరే లెవల్‌లో ఉంది. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వినిపిస్తుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం మరో విలన్‌ని దించుతున్నారట. `దసరా`లో విలన్‌గా నటించిన షైన్ టామ్ చాకో నటించిన విషయం తెలిసిందే. తనదైన విలనిజంతో మెప్పించారు.
తాజాగా `ఎన్బీకే109` కోసం మేకర్స్ ఆయన్ని సంప్రదించారట. ఓ కీలక పాత్ర కోసం ఆయన్ని అడుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంలో టామ్ చాకో ఏం చెప్పాడనేది తెలియాల్సి ఉంది. విలన్ పాత్రలతో ఆయన మెప్పిస్తున్న నేపథ్యంలో ఆయనది నెగటివ్ రోలా, పాజిటివ్ రోలా.. బాలయ్యతో తలపడతాడా? ఆయనతో కలిసి పోరాడతాడా? అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీని పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపందిస్తున్నారట దర్శకుడు బాబీ. బాలయ్యని నెక్ట్స్ లెవల్‌లో చూపించబోతున్నట్టు తెలుస్తుంది.
Also read: అల్లు అర్జున్ సినిమాకి దర్శకుడు అట్లీ అడుగుతున్న పారితోషికం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..