అల్లు అర్జున్‌ సినిమాకి దర్శకుడు అట్లీ అడుగుతున్న పారితోషికం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..

Published : Mar 12, 2024, 05:37 PM ISTUpdated : Mar 12, 2024, 05:39 PM IST
అల్లు అర్జున్‌ సినిమాకి దర్శకుడు అట్లీ అడుగుతున్న పారితోషికం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..

సారాంశం

`జవాన్‌`తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు దర్శకుడు అట్లీ. ఇప్పుడు బన్నీతో సినిమా చేయబోతున్నారు. దీనికి రికార్డు బ్రేకింగ్‌ పారితోషికం డిమాండ్‌ చేస్తున్నారట.   

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. ఈ మూవీపైనే అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. ఈ సారి బన్నీ పాన్‌ ఇండియా మార్కెట్‌ని మాత్రమే కాదు, గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేశాడు. `పుష్ప`లోనూ బన్నీ మ్యానరిజమ్స్, సాంగ్ ఇతర దేశాల ఆడియెన్స్ ని సైతం ఆకట్టుకోవడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఆ రేంజ్‌లోనే దర్శకుడు సుకుమార్‌ సినిమాని రూపొందిస్తున్నారు. 

ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ నెక్ట్స్ సినిమాలపై ఆసక్తికర అప్‌ డేట్స్ వినిపిస్తున్నాయి. అదే సమయంలో పెద్ద కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది. బన్నీ లైనప్‌లో ప్రధానంగా నాలుగు సినిమాలున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమాని అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు `యానిమల్‌` తో సంచలనం సృష్టించిన సందీప్‌ రెడ్డి వంగాతో సినిమాని ప్రకటించారు. 

దీంతోపాటు బోయపాటి శ్రీనుతో సినిమా చేసే కమిట్‌మెంట్ ఉంది. ఈ మూవీకి ప్లాన్‌ జరుగుతుందట. మరోవైపు తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయబోతున్నారని అంటున్నారు. అయితే బన్నీ నెక్ట్స్ మూవీ అట్లీతోనే ఉంటుందని లేటెస్ట్ ఇన్‌ఫర్మేషన్‌. అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్‌ మీడియాలో అదే చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందట, ఫైనల్‌ స్టేజ్‌ ఉందని తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే అట్లీ చివరగా షారూఖ్‌ ఖాన్‌ తో `జవాన్‌`సినిమాని రూపొందించారు. ఇది బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. వెయ్యి కోట్లు వసూలు చేసింది. ఈ మూవీతో దర్శకుడిగా తన సత్తా చాటాడు అట్లీ. దీంతో ఇప్పుడు ఆయనకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ఈ డిమాండ్‌కి తగ్గట్టుగానే పారితోషికం పెంచేస్తున్నాడట. నెక్ట్స్ మూవీకి ఆయన భారీగా డిమాండ్స్ చేస్తున్నారని సమాచారం. బన్నీతో తీయబోయే సినిమాకి ఓం రేంజ్‌లో అడుగుతున్నాడట. ఏకంగా 60కోట్ల పారితోషికం కోట్‌ చేస్తున్నారట. `జవాన్‌` హిట్‌ తో ఆయన ఈ మేరకు డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. 

Read more: రామ్‌చరణ్‌ని పోలీస్‌ బెల్ట్ తో కట్టిన చిరంజీవి.. నాగబాబుని బూతులు తిట్టడంతో ఘటన.. బన్నీకీ పడ్డాయట.. ఏమైందంటే

 ఇదే నిజమైతే కోలీవుడ్‌లోనే ఇది అత్యధిక పారితోషికం కాబోతుంది. మరే ఇతర దర్శకులు కూడా ఈ రేంజ్‌లో తీసుకోవడం లేదు. శంకర్‌తో సహా. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.  ఇక ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఈ మూవీ `పుష్ప2` రిలీజ్‌ అయ్యాక ప్రారంభమవుతుందని తెలుస్తుంది. 

Also read: తాగుడు, బిగ్‌ బాస్‌ గ్యాంగ్‌తో జల్సాలు.. ఆ దురలవాట్లే సూర్యకిరణ్‌ కొంపముంచాయా?.. నిర్మాత సంచలన కామెంట్స్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్