
ఈ వారం రిలీజై తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా గామి. టీజర్, ట్రైలర్ విడుదల అయ్యాక ఆ విజువల్స్ గురించి చర్చ మొదలై మంచి ఓపినింగ్స్ తెచ్చిపెట్టింది. దానికి మహాశివరాత్రి శెలవు రోజు కలొసొచ్చింది. విద్యాధర్ రావు కగిత దర్శకత్వంలో రూపొందించిన ‘గామి’.. మహాశివరాత్రి పర్వదినం కానుకగా శుక్రవారం బిగ్ స్క్రీన్స్‌లో విడుదలైంది. అయితే అర్బన్ ఏరియాలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మల్టిప్లెక్స్ లలో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. అంతా హ్యాపీ అనుకున్న టైమ్ లో ఓ వివాదం బయిటకు వచ్చింది. బుక్ మై షోలో ఫేక్ రేటింగులు ఇచ్చి, సినిమాని డామేజ్ చేస్తున్నారని సైబర్ క్రైమ్‌కీ, అలానే బుక్ మై షో నిర్వాహకులకూ ఫిర్యాదు చేసింది చిత్ర టీమ్.
గతంలో గుంటూరు కారం చిత్రానికి జరిగినట్లే ఇప్పుడు ‘గామి’ విషయంలోనూ అదే జరుగుతోంది. గామికి బుక్ మై షోలో పనిగట్టుకుని మరీ ఒకటి, రెండు రేటింగులు ఇస్తున్నారు. దాంతో బుక్ మై షోలో.. గామి రేటింగు దారుణంగా పడిపోయింది. గామి చిత్రానికి మంచి రివ్యూలు వచ్చినా ఇలా జరగటం అందరినీ ఆశ్చర్యపరిచింది. బుక్ మై షోలో ‘గామి’ రేటింగులు 2, 3 మాత్రమే కనిపించటంతో విశ్వక్‌సేన్ కూడా స్పందించాడు. తమ సినిమాని కావాలని తొక్కేస్తున్నారని, ఫేక్ రివ్యూలు ఇస్తున్నారని, దీనిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకొంటామని, తమని ఎంతగా తొక్కేస్తే అంతగా పైకి లేస్తామని తాను విడుదల చేసిన ఓ ప్రత్యేకమైన నోట్‌లో రాసుకొచ్చాడు విశ్వక్. ఎవరు ఎంతలా దెబ్బకొట్టాలని చూసినా, ప్రేక్షకులు తమ సినిమాని ఆశీర్వదించారని, అదే తమకు బలమని విశ్వక్ చెప్పుకొచ్చాడు.
ఇక ‘గామి’కి వరల్డ్‌వైడ్‌గా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం రైట్స్ రూ.3.5 కోట్లు, సీడెడ్ రూ.1.4 కోట్లు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.3.5 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ సమాచారం. ఓవర్సీస్తో కలుపుకొని ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.11 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఫస్ట్ వీకెండ్ లోనే మొత్తం బ్రేక్ ఈవెన్ అయ్యినా ఆశ్చర్యంలేదని అంటున్నారు. చూడాలి.