Radhe Shyam Pre Release event: నవీన్ పోలిశెట్టి అదిరిపోయే ఎంట్రీ.. రచ్చ రచ్చ చేసిన జాతిరత్నం

Published : Dec 23, 2021, 08:46 PM IST
Radhe Shyam Pre Release event: నవీన్ పోలిశెట్టి అదిరిపోయే ఎంట్రీ.. రచ్చ రచ్చ చేసిన జాతిరత్నం

సారాంశం

దేశవ్యాప్తంగా రాధే శ్యామ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో రాధే శ్యామ్ ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో గ్రాండ్ గా రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది.

దేశవ్యాప్తంగా రాధే శ్యామ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో రాధే శ్యామ్ ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో గ్రాండ్ గా రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పాన్ ఇండియా ఈవెంట్ గా గ్రాండ్ గా జరుగుతోంది. ప్రీ రిలీజ్ వేడుకకు అందాల యాంకర్ రష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. 

మరో సర్ ప్రైజ్ ఏంటంటే రష్మీతో పాటు జాతి రత్నం, యువ హీరో నవీన్ పోలిశెట్టికూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. వేదికపైకి ఎంట్రీ ఇవ్వగానే నవీన్ పోలిశెట్టి తన కామెడీ పంచ్ లతో రచ్చ షురూ చేశాడు. 

నవీన్ పోలిశెట్టి ఎంట్రీని వెరైటీగా ప్లాన్ చేశారు. జాతిరత్నం చిత్రంలోని పాట, సన్నివేశాలు ప్లే అవుతుండగా ఓ పెద్ద సింహాసనంపై నవీన్ పోలిశెట్టి ఎంట్రీ ఇచ్చాడు. తనదైన శైలిలో చిందులు వేస్తూ వేదిక కింద అతిథులుగా హాజరైన దర్శకులు నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా వద్దకు వెళ్ళాడు. వారిద్దరితో కలసి కాసేపు స్టెప్పులు వేశాడు. 

ప్రభాస్ అన్న జాతిరత్నాలు చిత్ర టైంలో మాకు ఎంతో సాయం చేశారు. ఆ రుణం తీర్చుకునే అవకాశం తనకు ఇలా వచ్చినందుకు సంతోషంగా ఉందని నవీన్ పోలిశెట్టి తెలిపాడు. ఈ క్రమంలో ప్రభాస్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దీనితో నవీన్ వెంటనే ప్రభాస్ వద్దకు వెళ్లి ఫ్యాన్స్ అందరికి హాయ్ చెప్పించాడు. 

Also Read: Allu Sneha: అల్లు అర్జున్ భార్యపై సమంత హాట్ కామెంట్స్.. బ్లాక్ శారీలో అల్లు స్నేహ గ్లామర్ మెరుపులు

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhita Dhulipala: ఆరెంజ్ చీరలో శోభిత వైరల్ లుక్..పెళ్ళిలో అదరగొట్టేసిందిగా
Agadha: ’అగధ’లో హీరోగా, యాంటీ హీరోగా సర్‌ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి.. మరిచిపోలేం