Anasuya: 'పుష్ప'లో అనసూయ షాకింగ్ రెమ్యునరేషన్.. బాగానే ముట్టిందిగా!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 23, 2021, 04:05 PM IST
Anasuya: 'పుష్ప'లో అనసూయ షాకింగ్ రెమ్యునరేషన్.. బాగానే ముట్టిందిగా!

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'Pushpa' చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'Pushpa' చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. కానీ అల్లు అర్జున్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిసారి బన్నీ రఫ్ లుక్ లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. 

అనసూయ ఈ చిత్రంపై చాలానే ఆశలు పెట్టుకుంది. రంగస్థలం చిత్రంలో అనసూయకు సుకుమార్ అద్భుతమైన రోల్ ఇచ్చారు. రంగమ్మత్త పాత్ర ఆ చిత్రంలో చాలా కీలకంగా మారింది. అనసూయకు నటిగా గుర్తింపు తెచ్చిపెట్టిన రోల్ అది. అదే తరహాలో పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్ర కూడా గుర్తింపు తీసుకువస్తుందని అనసూయ భావించింది. 

కానీ అనసూయ ద్రాక్షాయని పాత్ర ఆశించిన స్థాయిలో పేలలేదు. ఆమె రోల్ నామమాత్రంగా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ ఈ చిత్రంలో అనసూయకు పారితోషికం రూపంలో భారీ మొత్తమే ముట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అనసూయ 10 రోజుల కాల్ షీట్స్ కేటాయించింది. 10 రోజులకు గాను ఆమెకు రూ 12 లక్షల రెమ్యునరేషన్ అందినట్లు టాక్. 

పుష్ప మొదటి భాగంలో ఆమె పాత్ర నిడివి తక్కువే. కానీ సెకండ్ పార్ట్ లో అనసూయ పాత్ర చాలా కీలకంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ద్రాక్షాయణి పాత్రలో అనసూయ డీ గ్లామర్ రోల్ లో కనిపించింది. 

పుష్ప మొదటి భాగానికి సరైన టైం లేకపోవడంతో కొన్ని లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. కానీ పుష్ప సెకండ్ పార్ట్ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటాం అని మేకర్స్ చెబుతున్నారు. బన్నీకి జోడిగా ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు
Sobhita Dhulipala: తండ్రి కాబోతున్న నాగ చైతన్య, శోభిత.. సమంతకు అదిరిపోయే షాక్!