RRR Movie Promotions: ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రామ్ చరణ్ పప్పి

Published : Dec 23, 2021, 03:46 PM IST
RRR Movie Promotions: ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రామ్ చరణ్ పప్పి

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ (RRR movie)టీమ్ ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉంది. దేశంలోనే అతిపెద్ద మార్కెట్ గా ఉన్న బాలీవుడ్ ని ఆర్ ఆర్ ఆర్ తో కొల్లగొట్టాలని రాజమౌళి కంకణం కట్టుకున్నారు. తన ఇద్దరు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు అక్కడే తిష్ట వేశారు.

రాజమౌళి (Rajamouli), ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నారు. బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. బాహుబలి దర్శకుడి నుండి వస్తున్న తదుపరి చిత్రంగా ఆర్ఆర్ఆర్ ఇప్పటికే నార్త్ లో క్రేజ్ రాబట్టింది. అయినప్పటికీ ప్రమోషన్స్ లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదని రాజమౌళి గట్టి నిర్ణయం తీసుకున్నట్లున్నారు. ఆర్ఆర్ఆర్ హీరోలతో కలిసి భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

అక్కడి లోకల్, నేషనల్ మీడియాతో ప్రముఖంగా ముచ్చటిస్తున్నారు ఈ ముగ్గురు. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో తన పెట్ డాగ్ రైమ్ ని కూడా భాగం చేశారు. కొన్ని ప్రచార కార్యక్రమాల్లో రామ్ చరణ్ తో పాటు రైమ్ కూడా పాల్గొంటుంది. రామ్ చరణ్ (Ram charan)కంపెనీ రైమ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ పక్కనే ఉంటున్న రైమ్ (Ryme) స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. 

ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సమయం దగ్గర పడింది. ఇంకా కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. దీనితో విరామం లేకుండా ప్రమోషన్స్ చేపడుతున్నారు. ఇక పలు నగరాల్లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించనున్నట్లు రాజమౌళి తెలియజేశారు. నేషనల్ వైడ్ పాపులారిటీ దక్కేలా ఓ పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సల్మాన్ అతిథిగా ముంబైలో ఓ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. 

Also readAcharya Update: మెగా ఫ్యాన్స్ కోసం ఆచార్య నుంచి భారీ న్యూ ఇయర్ గిఫ్ట్.. ఏం ఇవ్వబోతున్నారు...?

దేశంలోనే అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కింది. ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. అలియా భట్, ఓలియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డివివి దానయ్య దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మించారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అజయ్ దేవ్ గణ్, సముద్ర ఖని, శ్రీయా శరణ్ కీలక రోల్స్ చేస్తున్నారు. 

Also read Rana with RRR: రామ్‌, భీమ్‌లతో భళ్లాలదేవ.. ఫోటో అదిరిపోయిందిగా.. వైరల్
 

PREV
click me!

Recommended Stories

కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు
రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?