ఎస్వీకె సినిమా బేనర్ లో "ఓయ్.. నిన్నే"

Published : Jul 01, 2017, 07:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఎస్వీకె సినిమా బేనర్ లో "ఓయ్.. నిన్నే"

సారాంశం

ఎస్వీకె సినిమా అధినేత వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఓయ్ నిన్నే గతంలో నారా రోహిత్ హీరోగా సోలో సినిమా తెరకెక్కించిన వంశీ కృష్ణ ఓయ్ నిన్నే చిత్రానికి దర్శకుడిగా సత్య చల్లకోటి

నారా రోహిత్‌తో సోలో చిత్రాన్ని నిర్మించి  నిర్మాతగా తన అభిరుచిని చాటుకొని విజయాన్ని అందుకున్న నిర్మాత ఎస్వీకె సినిమా అధినేత వంశీ కృష్ణ శ్రీనివాస్. ఆ తర్వాత అల్లరి నరేష్, శర్వానంద్ కలయికలో నువ్వా-నేనా, సందీప్‌కిషన్‌తో రా రా కృష్ణయ్య వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన వంశీకృష్ణ శ్రీనివాస్ తాజాగా నూతన హీరో, హీరోయిన్‌ను పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ఓయ్..నిన్నే. భరత్ , సృష్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా పరశురామ్, చందు మొండేటి, సుధీర్ వర్మల వద్ద దర్శకత్వ శాఖలో పలు చిత్రాలకు పనిచేసిన సత్య చల్లకోటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

 

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ గ్రామీణ నేపథ్యంలో నడిచే అందమైన కుటుంబ కథా చిత్రమిది. ఫ్యామిలీ ఎమోషన్స్ విత్ క్యూట్‌లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో అన్ని వర్గాలకు వారికి నచ్చే అంశాలున్నాయి. ఈ నెల రెండోవారంలో ఆడియోను విడుదల చేసి, చివరివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. భరత్, సృష్టి, తనికెళ్ళభరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, తాగుబోతు రమేష్, తులసి, ప్రగతి, ధన్‌రాజ్ తదితరులు నటస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటింగ్: మార్తండ్.కె.వెంకటేష్, ఫైట్స్: వెంకట్, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్, దర్శకత్వం: సత్య చల్లకోటి. 

PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్