ఒకపాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకొన్న మంచు విష్ణు "ఓటర్"

Published : Jul 01, 2017, 06:07 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఒకపాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకొన్న మంచు విష్ణు "ఓటర్"

సారాంశం

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఓటర్ రామారీల్స్ పతాకంపై నిర్మిస్తున్న సుధీర్ కుమార్ పూదోట జీ.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బైలింగువల్ మూవీ ఓటర్

మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ బైలింగువల్ "ఓటర్". "హీరో ఆఫ్ ది నేషన్" అనేది ట్యాగ్ లైన్.  

రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఐర్ ల్యాండ్ లో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకొని చిత్ర బృందం ఇండియా వచ్చింది. మిగిలిన ఒక పాటను ఓ ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధీర్ కుమార్ పూదోట (జాన్) మాట్లాడుతూ.. "తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న "ఓటర్" చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. ఐర్ ల్యాండ్ లో రెండు రొమాంటిక్ సాంగ్స్ ను మంచు విష్ణు-సురభిల కాంబినేషన్ లో తెరకెక్కించాం. ఇంకా ఒక పాట మిగిలి ఉంది. టాకీ పార్ట్ పూర్తయ్యి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.  "ఓటర్" చిత్రం మంచు విష్ణు కెరీర్ లో మైలురాయిగా నిలవడంతోపాటు మా చిత్ర బృందానికి మంచి పేరు తీసుకువస్తుంది. త్వరలోనే టైటిల్ లోగోను విడుదల చేసి.. ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం" అన్నారు. 

సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, బేసన్ నాగర్ రవి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: కిరణ్ మన్నే, కూర్పు: కె.ఎల్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ-నిర్మాత: కిరణ్ తనమాల, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాత: సుధీర్ కుమార్ పూదోట (జాన్), కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్!!

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌