
భారత్ –ఆసీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా అట్టహాసంగా కొనసాగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం క్రికెట్ లవర్స్, మూవీ లవర్స్‌తో నిండిపోయింది. ఫైనల్ మ్యాచ్ లో తెగ సందడి చేస్తున్నారు బాలీవుడ్ , టాలీవుడ్ హీరోలు. అంతే కాదు తమ ప్రమోషన్స్ కోసం ఈ మ్యాచ్ ను గట్టిగా వాడేసుకుంటున్నారు కూడా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం టైగర్ 3. నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంటూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
సల్మాన్ ఖాన్ ఇదేం పాడుపని.. స్టేజ్ పైనే ఆ హీరోకి ముద్దుల వర్షం... షాక్ లో కత్రీనా కైఫ్..
ఇదిలా ఉంటే మరోవైపు న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమా హాయ్ నాన్న . తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసింది నాని టీం.
ఈ స్టార్ హీరోలిద్దరూ ఫైనల్ మ్యాచ్‌లో తమ తమ సినిమాలను ప్రమోట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా సల్మాన్ ఖాన్ , ఇండియా జెర్సీలో ఉన్న నాని చిట్ చాట్ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఓ వైపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మరోవైపు స్టార్ హీరోల సందడి.. వీరి రాకతో ఆడియన్స్ తెగ సందడి చేస్తున్నారు ఈ మ్యాచ్ లో ఈ ఇద్దరు తారలు మాత్రమే కాదు.. విక్టరీ వెంకటేష్, షారూఖ్ ఖాన్, , దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్ ఇలా ఇంకా చాలా మంది సెలబ్రిటీలు మ్యాచ్ ను చూస్తున్నారు.
కాస్ట్లీవాచ్ పెట్టుకున్న రణ్ బీర్ కపూర్, రేటెంతో తెలిస్తే షాక్ అవుతారు..