హలో ట్రైలర్ లో మనం నంది అవార్డుపై సెటైర్

Published : Dec 03, 2017, 07:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
హలో ట్రైలర్ లో మనం నంది అవార్డుపై సెటైర్

సారాంశం

అఖిల్ హీరోగా నటించిన హలో మూవీ ట్రైలర్ విడుదల ఈ ట్రైలర్ లో మనం సినిమాకు అవార్డు అంటూ కార్డ్స్ నాగార్జున ఈ కార్డ్స్ మనంకు నంది ఇవ్వనందుకే వేయించారని టాక్

లెజెండ్ సీనియర్ అక్కినేని సహా... అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసినటించిన సినిమా ‘మనం’. ఈసినిమా స్క్రీన్ ప్లేలో దర్శకుడు విక్రమ్ కుమార్ అనుసరించిన టెక్నిక్ ఈ సినిమా ఘన విజయంలో కీలక పాత్ర వహించింది. తెలుగు ప్రేక్షకులను విశేషంగా మెప్పించిన ఈ చిత్రంలో సెంటిమెంట్, ఎమోషన్స్,  స్క్రీన్ ప్లే ఇలా అన్నీ హైలెట్. ఈ సినిమాకు బంగారు నంది అవార్డు కూడా ఖాయమని అంతా భావించారు.  

 

అయితే ‘మనం’ యూనిట్ అంచనాలు నంది అవార్డ్స్ విషయంలో తారుమారు అయ్యాయి.  దీంతో నాగార్జున ఈఅవార్డుల ఎంపిక పై చాలా అసహనంగా ఉన్నాడు. ప్రస్తుతం నంది అవార్డుల పై వివాదం నడుస్తున్న నేపథ్యంలో ‘హలో' మూవీ  యూనిట్ వర్గాలు లేటెస్ట్ గా విడుదల చేసిన ట్రైలర్ ప్రారంభంలో వేసిన కొన్ని కార్డ్స్ చర్చనీయాంశంగా మారాయి.

 

‘మనం' సినిమాను మీరు మీ హృదయపూర్వకంగా ఆదరించి అతిపెద్ద అవార్డును అందించారు. ‘మనం’ మేకర్స్ నుండి వస్తున్న మరో చిత్రం ‘హలో' అంటూ థియేట్రికల్ ట్రైలర్ లో స్పెషల్ కార్డ్స్ వేశారు. దీన్ని చూసిన చాలా మంది ‘మనం' చిత్రానికి నంది అవార్డు రాని విషయాన్ని తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు చేసే విధంగా ఈ పంచ్ లు వేసారని అంటున్నారు. 

 

ట్రైలర్ మొదలయ్యే ముందు వేసిన టైటిల్ కార్డ్స్... నాగార్జున ప్రత్యేకంగా వేయించినవే అని అంటున్నారు. నంది అవార్డ్ ల విషయంలో రేగిన రచ్చ సద్దుమణిగిందనుకుంటే.. ఇప్పుడు నాగార్జున వ్యూహాత్మకంగా తన ‘హలో’ ట్రైలర్ ద్వారా తిరిగి గుర్తుకు చేయడం చర్చనీయాంశమైంది.

 

ఇక హలో ట్రైలర్ లోని  యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు మరింత పెంచుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా