గురువు మరణంతో కంటతడి పెట్టిన ప్రభుదేవా

First Published Dec 2, 2017, 7:45 PM IST
Highlights
  • గురువు మరణంతో చలించిపోయి కంట తడిపెట్టిన ప్రభుదేవా
  • డాన్స్ మాస్టర్ బాడిద ధర్మరాజు వద్ద శిక్షణ తీసుకున్న ప్రభుదేవా
  • గురువు ధర్మరాజు మృతదేహం చూసి చలించిపోయిన ప్రభుదేవా

ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న డాన్సర్ ప్రభుదేవా. తన టాలెంట్ తో దేశంలోనే ది బెస్ట్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా... బాలీవుడ్ లో దర్శకుడిగానూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా ప్రభుదేవా డాన్స్ గురువు ధర్మరాజు (97) కన్నుమూశారు.

 

డాన్స్ మాస్టర్ బాడిగ ధర్మరాజు తన 20వ ఏట నుంచే డ్యాన్స్‌ పై ప్రేమతో తన చిన్నాన్న బీవీ నరసింహరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. అనంతరం చెన్నైలో స్థిరపడిన ఆయన ఎన్టీఆర్‌, కృష్ణ, మహేష్‌బాబు, ఉదయభాను, జూ.ఎన్టీఆర్‌ పలువురు ప్రముఖ హీరోలకు క్లాసికల్‌ డ్యాన్సర్‌గా పనిచేశారు. 

 

ప్రభుదేవా  సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ముందు ధర్మరాజు వద్ద నృత్యం నేర్చుకున్నారు.   హాంకాంగ్‌, హైదరాబాద్‌కు చెందిన పలువురు శిష్యులు ఇతని వద్దే శిక్షణ తీసుకుని ఎంతోమందికి నృత్యం నేర్పుతున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నస్రుల్లాబాద్‌ మండలం అంకోల్‌ క్యాంపులో అనారోగ్యంతో మృతిచెందారు. 

 

గురువు మరణ వార్త తెలియగానే ప్రభుదేవా తన గురువు భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ధర్మరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు.

click me!