రోజా నా రాజకీయ ప్రత్యర్థి.. ఆమెతో కలసి నేను చేయాలా.. నాగబాబు!

By tirumala ANFirst Published Nov 25, 2019, 5:36 PM IST
Highlights

ఏళ్లతరబడి బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న కామెడీ షో జబర్దస్త్ లో వివాదాలు మొదలైన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా మొదలైన వివాదాల నేపథ్యంలో జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి న్యాయనిర్ణేతగా వ్యవరించిన సంగతి తెలిసిందే. 

ఏళ్లతరబడి బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న కామెడీ షో జబర్దస్త్ లో వివాదాలు మొదలైన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా మొదలైన వివాదాల నేపథ్యంలో జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి న్యాయనిర్ణేతగా వ్యవరించిన సంగతి తెలిసిందే. 

ఇటీవలే జబర్దస్త్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు నాగబాబు ప్రకటించారు. తన జబర్దస్త్ జర్నీని, ఈ కామెడీ షో నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అనే సంగతులని వివరిస్తూ నాగబాబు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. తాను జబర్డస్త్ నుంచి తప్పుకోవడానికి కారణం శ్యామ్ ప్రసాద్ రెడ్డితో వచ్చిన వ్యాపారపరమైన విభేదాలే అని నాగబాబు అన్నారు. 

తాజాగా నాగబాబు మాట్లాడుతూ.. తాను జబర్దస్త్ షోలోకి రావడానికి కారణం శ్యామ్ ప్రసాద్ రెడ్డి కాదని అన్నారు. ఏడుకొండలు అనే మేనేజర్ తనని అదుర్స్ అనే షోకు తీసుకునివచ్చాడు. అదే సమయంలో జబర్దస్త్ షోకు ప్లాన్ జరుగుతోంది. ఈ షోకు జడ్జిగా ఏడుకొండలు తాను అయితే బావుంటుందని శ్యామ్ ప్రసాద్ రెడ్డికి తెలిపాడు. అప్పుడే శ్యామ్ ప్రసాద్ రెడ్డి తనని సంప్రదించినట్లు నాగబాబు పేర్కొన్నారు. 

నితిన్, విజయ్ దేవరకొండ, సమంత ఢీ అంటే ఢీ.. హవా మొత్తం కుర్రాళ్ళదే!

అదుర్స్ షోకి లక్షలు పెట్టినా సక్సెస్ కాలేదు. కానీ జబర్దస్త్ షో సూపర్ హిట్ అవుతుందని నేను ముందే చెప్పా. మొదట జబర్దస్త్ షో ఇన్నేళ్ల పాటు కొనసాగించాలని అనుకోలేదు. ముందుగా కేవలం 25 ఎపిసోడ్స్ తో ఈ షో ముగుస్తుందని చెప్పారు. కానీ ఈ షో బాగా జనాలకు నచ్చడంతో ఏళ్లతరబడి కొనసాగుతోంది. 

జడ్జిగా నేను అంగీకరించా. ఫీమేల్ జడ్జిగా రోజాని అనుకుంటున్నట్లు నాతో చెప్పారు. ఆ సమయంలో మేమిద్దరం రాజకీయ ప్రత్యర్థులం. ఆమె టిడిపిలో ఉన్నారు. నేను ప్రజారాజ్యంలో ఉన్నా. ఆ తర్వాత రోజా వైసిపిలోకి.. తాను అన్నయ్య చిరంజీవి గారితో కలసి కాంగ్రెస్ లోకి వెళ్లాం. రోజా జడ్జి అనగానే కొంచెం ఆలోచించా. మేమిద్దరం రాజకీయ ప్రత్యర్థులం కదా.. కలసి షోలో పాల్గొనడం సరైనదేనా అని అనుకున్నా. 

ఉదయ్ కిరణ్ బయోపిక్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కుర్ర హీరో

కానీ తామిద్దరం రాజకీయ విభేదాలని పక్కన పెట్టి ఈ షోలో పాల్గొనేందుకు హుందాగా అంగీకరించాం అని నాగబాబు తెలిపారు. వేణు, ధనరాజ్, చంటి, షకలక శంకర్ లాంటి నటుల ప్రతిభతో రోజు రోజుకు జబర్దస్త్ పాపులారిటీ పెరుగుతూ పోయింది. 

మొదట జబర్దస్త్ అనే కాన్సెప్ట్ ని తీసుకువచ్చింది సంజీవ్ అనే దర్శకుడు. ఆ తర్వాత నితిన్, భరత్ చాలా కష్టపడి జబర్దస్త్ ని కొనసాగించారు. యాంకర్ గా రష్మీ, అనసూయ అలరించారు. అలా తొలి ఎపిసోడ్ 6 టిఆర్పి రేటింగ్ తో ప్రారంభమైన జబర్దస్త్ రికార్డుస్థాయిలో 15 టిఆర్పికి చేరుకుందని నాగబాబు తెలిపారు. 

click me!