'అయోధ్య రామమందిరం' కథతో బాహుబలి రచయిత.. క్రేజీ హీరోయిన్ మాస్టర్ ప్లాన్!

By tirumala ANFirst Published Nov 25, 2019, 4:44 PM IST
Highlights

శతాబ్దాల తరబడి తీవ్రమైన వివాదాలతో మగ్గుతూ వచ్చిన అయోధ్య రామమందిరం వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. కొన్ని రోజుల క్రితం సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో అయోధ్య వివాదం ముగిసింది.

శతాబ్దాల తరబడి తీవ్రమైన వివాదాలతో మగ్గుతూ వచ్చిన అయోధ్య రామమందిరం వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. కొన్ని రోజుల క్రితం సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో అయోధ్య వివాదం ముగిసింది. అయోధ్యలో వివాదంగా ఉన్న భూమిని హిందువులకే కేటాయిస్తూ ధర్మాసనం నవంబర్ 9న తీర్పు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ముస్లింల మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని వేరేచోట కేటాయించాలని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. సుప్రీం తీర్పుని అంతా స్వాగతించారు. అయోధ్య రామమందిర వివాదం ఇండియాలోనే అత్యంత వివాదభరిత అంశాలలో ఒకటిగా నిలిచింది. ఇలాంటి సంఘటనలు ఏం జరిగినా వెంటనే రచయితలు, దర్శకులు తమ క్రియేటివిటీకి పదును పెడుతుంటారు. 

అయోధ్య రామమందిరం అంశంపై బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేయబోతున్నారు. ఈ ఆసక్తికర చిత్రాన్ని బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ నిర్మించనుండడం విశేషం. ఈ విషయాన్ని కంగనా సోదరి రంగోలి స్వయంగా ప్రకటించారు. ఈ చిత్రానికి 'అపరాజిత అయోధ్య' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 

కంగనా రనౌత్ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టేందుకు ఇదే సరైన కథాంశం అని రంగోలి అన్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనుందట. కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక, ప్రస్తుతం తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్ చిత్రాలకు విజయేంద్ర ప్రసాద్ రచయితగా పనిచేశారు. 

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా అపరాజిత అయోధ్య రానుంది. త్వరలో దర్శకుడు, నటీనటుల వివరాలని ప్రకటించనున్నారు. అయోధ్య అంశంపై సినిమా అంటే ప్రతి ఒక్కరిలో సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. 

click me!