'వరుడు కావలెను' ట్రైలర్: 'పొగరుబోతులకి ప్రీమియర్ లీగ్ పెడితే ఆవిడే విన్నర్'

pratap reddy   | Asianet News
Published : Oct 21, 2021, 09:31 PM IST
'వరుడు కావలెను' ట్రైలర్: 'పొగరుబోతులకి ప్రీమియర్ లీగ్ పెడితే ఆవిడే విన్నర్'

సారాంశం

యంగ్ హీరో నాగశౌర్య, క్రేజీ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. లేడి డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

యంగ్ హీరో నాగశౌర్య, క్రేజీ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. లేడి డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కుటుంబ కథా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మురళి శర్మ, 'అత్తారింటికి దారేది' నదియా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నేడు ట్రైలర్ లాంచ్ చేసింది. ఆరడుగుల ఆజానుబాహుడు Rana Daggubati చేతుల మీదుగా Varudu Kaavalenu ట్రైలర్ లాంచ్ కావడం విశేషం. ఇక ట్రైలర్ లో విశేషాలు తెలుసుకుందాం. ట్రైలర్ చూస్తుంటే వరుడు కావలెను చిత్రం యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. 

ఆకాష్ గా Naga Shaurya, అందమైన యువతి భూమిగా Ritu Varma నటించారు. పెళ్లి, పెళ్లి చూపులు అంటే ఇష్టం లేని యువతి గా రీతూ వర్మ మెప్పిస్తోంది. హీరో హీరోయిన్లు ఇద్దరూ చాలా అందంగా కనిపించారు. రీతూ వర్మ కుర్రాళ్లని మాయలో ముంచేయడం ఖాయం. ఇక దిగు దిగు నాగ సాంగ్ మాస్ ప్రేక్షకులకు ఫీస్ట్ లాగా ఉంది. 

Also Read:చిరిగిపోయిన అతుకుల డ్రెస్ లో ప్రియమణి హాట్ ఫోజులు.. నెటిజన్లు ఫిదా

'నా పేరు తెలుసా.. ఆకాష్..భూమికి అన్ని వైపులా నేనే ఉంటాను' అంటూ నాగ శౌర్య చెప్పే పవర్ ఫుల్ డైలాగ్.. 'పొగరుబోతులకి ప్రీమియర్ లీగ్ పెడితే అన్ని సీజన్లలో ఈవిడే విన్నర్' అంటూ వెన్నెల కిషోర్ చెప్పే ఫన్నీ డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ లో ప్రతి ప్రేము కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. వెన్నెల కిషోర్, సప్తగిరి, ప్రవీణ్ ఈ చిత్రంలో కమెడియన్లుగా నటిస్తున్నారు. 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా వరుడు కావలెను ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..