'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీం సక్సెస్ పార్టీ.. ఫుల్ జోష్ లో అఖిల్, పూజా హెగ్డే

By telugu team  |  First Published Oct 21, 2021, 7:24 PM IST

అఖిల్ నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. గత వారం అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న Akkineni Akhil దాహం తీర్చిన చిత్రం ఇది. 


అఖిల్ నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. గత వారం అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న Akkineni Akhil దాహం తీర్చిన చిత్రం ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లతో ఈ మూవీ దూసుకుపోతోంది. 

అఖిల్, Pooja Hegde కెమిస్ట్రీ యువతని ఆకట్టుకుంటోంది. మ్యారేజ్, రొమాన్స్ అంశాలని హైలైట్ చేస్తూ బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. దసరా ఫెస్టివల్ సీజన్ లో విడుదల చేయడం కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చిందనే చెప్పాలి. ఏది ఏమైనా అక్కినేని అఖిల్ తొలి హిట్ కొట్టేశాడు. 

Latest Videos

చిత్ర యూనిట్ కూడా జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సినిమా విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో అల్లు అరవింద్, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, సంగీత దర్శకుడు గోపి సుందర్ తో పాటు అఖిల్, పూజా హెగ్డే ల జంట కూడా పాల్గొంది. 

 

Here are pics from the 𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 success party bash! 𝐈𝐧 𝐂𝐢𝐧𝐞𝐦𝐚𝐬 𝐍𝐨𝐰! pic.twitter.com/OzPib2mSwa

— GA2 Pictures (@GA2Official)

తొలి విజయం అందుకున్న సంతోషంలో అఖిల్ ఉంటే.. తాను పట్టిందల్లా బంగారం అవుతున్న పూజా హెగ్డే ఫుల్ జోష్ లో కనిపించింది. కరోనా కారణంగా ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో గతవారం ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. 

Also Read: పరువు నష్టం దావా కేసులో సమంత స్టేట్మెంట్ ఇదిగో.. అబార్షన్, 300 కోట్ల డీల్ అంటూ..

అఖిల్, పూజా హెగ్డే ల పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో బాగా హైలైట్ అయింది. ఎప్పటిలాగే పూజా తన గ్లామర్ తో కట్టిపడేసింది. ఆరెంజ్, ఒంగోలు గిత్త లాంటి డిజాస్టర్ చిత్రాలతో చాలా కాలం పాటు బొమ్మరిల్లు భాస్కర్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. Most Eligible Bachelor రూపంలో మరో అవకాశం రావడంతో చక్కగా వినియోగించుకున్న ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారనే చెప్పాలి. 

 

click me!