సమంత పరువు నష్టం దావా: కోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రేపటికి వాయిదా

By Siva KodatiFirst Published Oct 21, 2021, 7:48 PM IST
Highlights

సినీనటి సమంత దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై (defamation petition) కూకట్‌పల్లి కోర్టులో (kukatpally court) వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.

సినీనటి సమంత దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై (defamation petition) కూకట్‌పల్లి కోర్టులో (kukatpally court) వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. పరువు నష్టం దావా వేసే బదులు... వారి నుంచి క్షమాపణ అడగొచ్చు కదా అని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. సెలబ్రెటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టేది వారేనని... పరువుకు భంగం కలిగింది అనేది వారే కదా అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే దీనిపై సమంత తరపు న్యాయవాది స్పందిస్తూ  తన క్లయింట్ విడాకులు ఇంకా తీసుకోకుండానే... సమంతపై దుష్ప్రచారం చేశారని తెలిపారు. సమంతను టార్గెట్ చేసి వార్తలు రాశారని.. తప్పుడు వార్తలు రాసినవారికి పర్మినెంట్ ఇంజక్షన్ ఇవ్వాలని సమంత న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై కాసేపట్లో తీర్పును వెలువరించారు. 

అంతకుముందు హీరోయిన్ సమంత తరఫు న్యాయవాదిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబ్ చానెళ్లపై సమంత పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను అత్యవసరంగా చేపట్టాలని Samanta తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అత్యవసర పిటిషన్ గా భావించి దానిపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై న్యాయమూర్తి సమంత తరఫు న్యాయవాది బాలాజీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు అందరూ సమానమేనని న్యాయమూర్తి చెప్పారు. పేరున్న వ్యక్తా, కాదా అనేది కోర్టు అనవసరమని అన్నారు. అరగంట తర్వాత సమంత పిటిషన్ మీద విచారణ జరుపుతామని చెప్పారు. 

ALso Read:పరువు నష్టం దావా: సమంత న్యాయవాదిపై న్యాయమూర్తి ఆగ్రహం

తాము విడాకులు తీసుకుంటున్నట్లు నాగచైతన్య, సమంత సంయుక్త ప్రకటన చేశారు. ఆ తర్వాత సమంతపై పలు ఊహాగానాలు చెలరేగాయి. వారి విడాకులకు సమంత ప్రవర్తనే కారణమంటూ యూట్యూబ్ చానెళ్లు దుమ్మెత్తిపోశాయి. స్టైలిస్ట్ ప్రీతంతో ఆమెకు సంబంధాలున్నాయని ప్రచారం జరిగింది. దానిపై సమంత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అలాగే ఆమె అబార్షన్ చేయించుకుందని కూడా అబద్ధపు ప్రచారా సాగింది. ఇది కూడా ఆమెకు తీవ్ర వేదనను కలిగించింది. దాంతో ఆమె రెండు యూట్యూబ్ చానెళ్లపై కూకట్ పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన పరువు నష్టం దావాలో తాను గుర్తింపు పొందిన విషయాలను వివరంగా ప్రస్తావించారు. తన పరువును దిగజార్చేవిధంగా ప్రచారం సాగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

సమంత 2017లో Nagachaitanyaను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన తమ ఇద్దరం విడిపోతున్నట్లు ప్రకటన చేశారు. ఆ తర్వాతనే ఆమెపై తీవ్రమైన దుష్ప్రచారం ప్రారంభమైంది. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తూ వచ్చారు. పలు హిట్ సినిమాల్లో ఆమె నటించారు. ఇటీవల ఆమె జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు టీవీ షోలో కూడా పాల్గొన్నారు. 
 

click me!