చైతు పెళ్లికొడుకాయెనే

Published : Oct 06, 2017, 12:01 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
చైతు పెళ్లికొడుకాయెనే

సారాంశం

వివాహ బంధంతో ఒక్కటి కానున్న చైతన్య, సమంత పెళ్లికొడుకుగా ముస్తాబైన నాగచైతన్య ఫోటోలు షేర్ చేసిన నాగార్జున

అక్కినేని వారింట పెళ్లి సందడి మొదలైంది. అక్టోబర్ 6( శుక్రవారం), 7వ తేదీల్లో నాగచైతన్య, సమంతల వివాహం  గోవాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించి తొలి ఫోటో బయటకు వచ్చింది.  చైతు పెళ్లి కొడుకుగా ముస్తాబైన ఫోటోని  నాగార్జున, వెంకటేష్ లు ట్విట్టర్ లో షేర్  చేశారు. ఒక వైపు తండ్రి నాగార్జున, మరో వైపు మేనమామ వెంకటేష్.... మధ్యలో నాగ చైతన్య కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క పెట్టుకుని పెళ్లికి సిద్ధమైన ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సమంత, నాగ చైతన్య వివాహానికి అక్టోబర్ 6వ తేదీ రాత్రి 11.52 గంటలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. ఈ వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం జరుగనుంది. అంతకుంటే ముందు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మెహందీ వేడుక జరుగనున్నట్లు సమాచారం. ఈ వివాహ వేడుకకు అక్కినేని, దగ్గుబాటు కుటుంబాలతోపాట సమంత కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు.శనివారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో సమంత, నాగచైతన్యలు క్రైస్తవ సాంప్రదాయంలో వివాహం చేసుకోనున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?
Bigg Boss Telugu 9 విన్నర్‌లో మార్పు.. ఆడియెన్స్ ఓటింగ్‌తో పనిలేదా? అంతా వీళ్లదే నిర్ణయం