మిస్టర్ శ్రీనువైట్ల రెమ్యునరేషన్ కాకి ఎత్తుకెళ్లిందా..

First Published Apr 20, 2017, 3:33 PM IST
Highlights
  • మిస్టర్ శ్రీనువైట్ల రెమ్యునరేషన్ వదులుకున్నాడంటే నమ్ముతారా..
  • అసలు శ్రీనువైట్లకు అంత అవసరం ఉందంటారా..

ఆగడు,బ్రూస్ లీ లాంటి ఫ్లాపులతో సతమతమవుతున్న దర్శకుడు శ్రీనువైట్ల మిస్టర్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తన సత్తా మరోసారి నిరూపించాలనుకున్నాడు. కానీ సినిమాపై ఎంత ఎఫర్ట్ పెట్టినా కథ రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అయితే మిస్టర్‌ కు సంబంధించి శ్రీను వైట్ల పై కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 

వివిధ కోణాలున్న మిస్టర్ కథకు నిర్మాతలను ఒప్పించిన తర్వాత ఆ చిత్రానికి రెమ్యూనరేషన్ తీసుకోనని చెప్పినట్టు సమాచారం. తన రెమ్యూనరేషన్ మొత్తం కింద మిస్టర్‌ను చాలా లావిష్‌గా తెరకెక్కించాలనే కోరికన నిర్మాతల ముందు పెట్టినట్టు సమాచారం. సినిమా సూపర్ హిట్ అయితే వచ్చే లాభాల్లో తన పారితోషికాన్ని తీసుకొంటాను అనే ప్రపోజల్ ముందు పెట్టడం, ఆ ప్రతిపాదన నిర్మాతలకు కూడా నచ్చడం మిస్టర్ సినిమా మొదలైందని సమాచారం.

 

ఆ క్రమంలో తన కథకు న్యాయం చేసే క్రమంలో నిర్మాతలను లెక్కకు మించి ఖర్చు పెట్టించినట్టు తెలిసింది. అంతేకాకుండా స్పెయిన్, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మంచి లోకేషన్లలో షూటింగ్ జరిపారు. సినిమాలో లెక్కకు మించిన క్యారెక్టర్లు, నటీనటుల సంఖ్య కూడా భారీగానే కనిపించింది. ఆ విధంగా నిర్మాణ వ్యయం తడిసి మోపడైనట్టు తెలుస్తున్నది. తాజాగా మిస్టర్‌పై ఆర్థికంగా ఆశాజనకమైన ఫలితాలు రాకపోవడం నిర్మాతలను షాక్ గురిచేసినట్టు తెలుస్తున్నది.

 

ఇదిలా ఉంటే దర్శకుడు శ్రీనువైట్ల రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేశాడనే రూమర్ ఫిలింనగర్‌లో వైరల్ అయింది. అయితే శ్రీను వైట్ల ప్రతిపాదన నిజమా? అనేదానిపై ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. హిట్ల మీద హిట్లిచ్చిన శ్రీను వైట్లపై ఇలాంటి రూమర్లు రావడం సన్నిహితులను ఆవేదనకు గురిచేస్తోంది. ఒకట్రెండు ఫ్లాపులు పడితే దర్శకుడిలో సత్తా లేనట్టా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు కొందరు.

click me!