RRR కేరళ ఈవెంట్ లో మెరిసిన సూపర్ హీరో.. రాజమౌళి అంటే అంతే మరి

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 29, 2021, 10:08 PM IST
RRR కేరళ ఈవెంట్ లో మెరిసిన సూపర్ హీరో.. రాజమౌళి అంటే అంతే మరి

సారాంశం

దేశవ్యాప్తంగా యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎప్పటిలాగే ఈ చిత్రంపై కూడా రాజమౌళి ఒక రేంజ్ లో అంచనాలు సెట్ చేశారు. ప్రస్తుతం రాంచరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ ముగ్గురూ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నారు.

దేశవ్యాప్తంగా యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎప్పటిలాగే ఈ చిత్రంపై కూడా రాజమౌళి ఒక రేంజ్ లో అంచనాలు సెట్ చేశారు. ప్రస్తుతం రాంచరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ ముగ్గురూ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నారు. జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడమే మిగిలి ఉంది. 

నేడు బుధవారం కేరళ త్రివేండ్రంలో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో పెద్ద ఎత్తున కేరళ ప్రేక్షకులు సందడి చేశారు. ముంబై, చెన్నైలో ఇప్పటికే ఈవెంట్స్ ముగిశాయి. ముంబైలో జరిగిన ఈవెంట్ కు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. చెన్నైలో జరిగిన ఈవెంట్ కి శివకార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ గెస్ట్ లుగా హాజరయ్యారు. 

కేరళ ఈవెంట్ కు ఊహించని విధంగా యువ నటుడు టోవినో థామస్ అతిథిగా హాజరయ్యాడు. థామస్ ని అతిథిగా ఇన్వైట్ చేయడంలో జక్కన్న రాజమౌళి ప్రమోషనల్ స్ట్రాటజీ స్పష్టంగా కనిపిస్తోంది. టోవినో థామస్ సూపర్ హీరోగా నటించిన 'మిన్నల్ మురళి' నెట్ ఫ్లిక్స్ లో విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అవుతుండడం విశేషం. దీనితో థామస్ క్రేజీ హీరోగా మారిపోయాడు. 

ఇలాంటి హీరో ఆర్ఆర్ఆర్ ఈవెంట్ లో మెరిస్తే కేరళ యువతలో మంచి పబ్లిసిటీ లభిస్తుంది. అదన్నమాట జక్కన్న ప్లాన్. కేరళ ఈవెంట్ లో థామస్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ చిత్రం బాహుబలి 2ని మించేలా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీజర్స్ ట్రైలర్స్ చూశాక తాను కూడా జనవరి 7 కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.  

Also Read: NTR about depression: డిప్రెషన్ కు గురయ్యా, కెరీర్ పడిపోతున్న టైంలో.. ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్

Also Read: మాళవిక మోహనన్ అందాల విస్ఫోటనం.. హాట్ నెస్ మైండ్ బ్లోయింగ్ అంతే..

PREV
click me!

Recommended Stories

Akira Nandan: నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? రేణు దేశాయ్‌ ఫోన్‌ చేస్తే పవన్‌ రియాక్షన్‌ ఇదే
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్, ఎమోషనల్ కామెంట్స్